ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 వేల ఏళ్లుగా భారతీయులందరి డీఎన్ఏ ఒక్కటే

ABN, First Publish Date - 2021-12-19T22:51:11+05:30

ధర్మశాల: 40 వేల ఏళ్లుగా భారతీయులందరి డీఎన్ఏ ఒక్కటేనని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధర్మశాల: 40 వేల ఏళ్లుగా భారతీయులందరి డీఎన్ఏ ఒక్కటేనని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో జరిగిన మాజీ సైనికుల కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ భారతీయుల పూర్వీకులందరూ ఒకరేనని చెప్పారు. వారి వల్లనే దేశం అభివృద్ధి చెందడంతో పాటు సంస్కృతి కొనసాగుతోందన్నారు. కేంద్రంలోని బీజేపీ సారధ్యంలోని ప్రభుత్వంపై ఆర్ఎస్ఎస్‌కు నియంత్రణ ఉండదని స్పష్టం చేశారు. పరిపాలకుల్లో సంఘ సిద్ధాంతం నుంచి వచ్చిన వారిలో కొందరుంటారని వారెప్పటికీ సంఘ్ వారిగానే కొనసాగుతారని భాగవత్ చెప్పారు. ఆర్ఎస్ఎస్ గురించి మరింత లోతుగా తెలుసుకోవాలని కార్యక్రమానికి హాజరైన వందలాది మంది మాజీసైనికులను ఉద్దేశించి అన్నారు. ప్రభుత్వాలు తమకు వ్యతిరేకంగా ఉన్నా 96 సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ దేశం కోసం పనిచేస్తోందని చెప్పారు. సమాజంలో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఆర్ఎస్ఎస్ ముందుంటుందని భాగవత్ చెప్పారు. 



Updated Date - 2021-12-19T22:51:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising