ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ తీవ్రతను తగ్గించే ఫ్లువోగ్జామిన్‌

ABN, First Publish Date - 2021-10-29T08:20:51+05:30

ఒత్తిడి, తీవ్రమైన నిరాశ తదితర మానసిక సమస్యలకు చికిత్స కోసం ఉపయోగించే ఫ్లువోగ్జామిన్‌ ఔషధం కొవిడ్‌ నియంత్రణలో మంచి ఫలితాలు ఇస్తుందని తాజా అధ్యయనం పేర్కొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తక్కువ ధరకు లభించే యాంటీ-డిప్రెసెంట్‌ ఔషధం

వాషింగ్టన్‌, అక్టోబరు 28: ఒత్తిడి, తీవ్రమైన నిరాశ తదితర మానసిక సమస్యలకు చికిత్స కోసం ఉపయోగించే ఫ్లువోగ్జామిన్‌ ఔషధం కొవిడ్‌ నియంత్రణలో మంచి ఫలితాలు ఇస్తుందని తాజా అధ్యయనం పేర్కొంది. అమెరికా నుంచి వెలువడే లాన్సెట్‌ గ్లోబల్‌ హెల్త్‌ జర్నల్‌లో ఈ అధ్యయనం వివరాలను ప్రచురించారు. దీని ప్రకారం.. కొవిడ్‌ లక్షణాలు తీవ్రంగా ఉన్న రోగుల్లో కొంతమందికి ఫ్లువోగ్జామిన్‌ ఇచ్చారు. మరికొంతమందికి సాధారణ కొవిడ్‌ చికిత్స అందించారు. అందరినీ 28 రోజులపాటు పరిశీలించారు. ఫ్లువోగ్జామిన్‌ తీసుకున్న కొవిడ్‌ రోగుల్లో 30 శాతం మందికి ఆస్పత్రికి వెళ్లే అవసరం లేకుండానే వ్యాధి తీవ్రత తగ్గినట్టు కనుక్కున్నారు. ఫ్లువోగ్జామిన్‌ తీసుకున్న కొవిడ్‌ రోగుల్లో ఒకరు మాత్రమే మరణించగా, ఇతర చికిత్స తీసుకున్నవారిలో 12 మంది మృతిచెందారని అధ్యయనం పేర్కొంది. తక్కువ ధరకు ఈ ఔషధం లభిస్తున్నందున పేద దేశాల్లో దీన్ని వాడటం ద్వారా కొవిడ్‌ మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని అధ్యయనం పేర్కొంది. అమెరికాలోని వాషింగ్టన్‌ యూనివర్సిటీ, కెనడాలోని మెక్‌మాస్టర్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు.

Updated Date - 2021-10-29T08:20:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising