ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bengal: ఉప్పొంగిన నదులు...23మంది మృతి

ABN, First Publish Date - 2021-08-07T13:47:20+05:30

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలతో మూడు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా (పశ్చిమబెంగాల్): పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలతో మూడు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దక్షిణ బెంగాల్ లోని హుగ్లీ, పుర్బా మేదినిపూర్, హౌరా, దక్షిణ పరగణాల ప్రాంతాల్లో వరదనీరు వెల్లువెత్తుతోంది. మల్దా జిల్లాలో గంగా,పుల్హార్, మహానదుల్లో వరదనీరు ప్రవహిస్తోంది. భారీవర్షం వల్ల దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ డ్యామ్ నుంచి వరదనీటిని విడుదల చేయడంతో పలు లోతట్టుప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ వరదల్లో 23 మంది మరణించగా, లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ డ్యామ్ నుంచి 29వేల క్యూసెక్కుల వరదనీటిని విడుదల చేశారు. 



లోతట్టుప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి సహాయ, పునరావాస పనులు చేపట్టారు. సహాయక సామాగ్రిని వరద బాధితులకు అందజేశారు.లక్షలాది ఎకరాల పొలాలు నీట మునిగాయి.సహాయ శిబిరాల్లో వరద బాధితులకు ఆహారం అందజేశారు.మాల్డాలోని మణిక్‌చక్ ఘాట్ పాయింట్ వద్ద గంగా నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది.

Updated Date - 2021-08-07T13:47:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising