ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కారులా.. విమానాన్నే నెట్టేశారిలా..!

ABN, First Publish Date - 2021-12-05T08:08:13+05:30

రోడ్డుపై ఓ వాహనం అడ్డంగా నిలిచిపోతే.. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా దాన్ని పక్కకు నెట్టేస్తుంటాం. కానీ.. ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖాట్మండూ, డిసెంబరు 4: రోడ్డుపై ఓ వాహనం అడ్డంగా నిలిచిపోతే.. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా దాన్ని పక్కకు నెట్టేస్తుంటాం. కానీ.. అది కారు, బస్సు, లారీ వరకే పరిమితం. అంతకు మించిన భారీ వాహనాన్ని నెట్టడం ఎప్పుడైనా చూశారా? ఆ అవకాశమే లేదు.. అనుకుంటున్నారా! అయితే.. ఇలాంటి అరుదైన సన్నివేశం నేపాల్‌లో ఆవిష్కృతమైంది. అక్కడి ప్రజలు ఏకంగా ఓ విమానాన్నే అలవోకగా పక్కకు నెట్టేశారు. అక్కడి కోల్టిలోని బజురా ఎయిర్‌పోర్టులో రన్‌వేపై ‘తార’ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ చిన్న విమానం నిలిచిపోయింది. ఓ టైరు పగిలిపోవడంతో.. అది కదిలే పరిస్థితి లేకపోయింది. అది పక్కకు వెళితే గానీ.. మరో విమానం ఆ రన్‌వేపై దిగలేదు. ఆ విమానాశ్రయంలో క్రేన్లు కూడా అందుబాటులో లేకపోవడంతో.. ఈ విమానాన్ని పక్కకు నెట్టే బాధ్యతను అక్కడున్న ప్రయాణికులే తీసుకున్నారు. ఓ 20 మంది ప్రయాణికులు, సెక్యూరిటీ సిబ్బంది కలిసి.. ఓ కారునో, బస్సునో తోసినంత సులువుగా ఆ విమానాన్ని పక్కకు నెట్టేశారు. దీంతో.. తర్వాతి విమానం రన్‌వేపై దిగేందుకు అవకాశం దొరికింది. ప్రస్తుతం ఈ వీడియో.. నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఇది చూసిన నెటిజన్లు.. ‘ఇది నేపాలీలకు మాత్రమే సాధ్యమైంది. ఎప్పుడూ చూడలేమనుకున్న సన్నివేశాన్ని చూపించినందుకు కృతజ్ఞతలు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

Updated Date - 2021-12-05T08:08:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising