ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విమాన ప్రయాణికులకు ఈ-పాస్‌ తప్పనిసరి

ABN, First Publish Date - 2021-12-18T14:28:15+05:30

రాష్ట్రంలో ‘ఒమైక్రాన్‌’ కేసులు బయటపడటంతో విమానాశ్రయాల్లో కరోనా నిబంధనలను కఠినతరం చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయాల్లో దిగే ప్రయాణికులకు రాష్ట్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: రాష్ట్రంలో ‘ఒమైక్రాన్‌’ కేసులు బయటపడటంతో విమానాశ్రయాల్లో కరోనా నిబంధనలను కఠినతరం చేసేందుకు  రంగం సిద్ధమైంది. ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయాల్లో దిగే ప్రయాణికులకు రాష్ట్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆర్టీపీసీఆర్‌, ర్యాపిడ్‌ టెస్టులను నిర్వహిస్తోంది. ఆ పరీక్షల్లో వైరస్‌ సోకిన లక్షణాలు బయటపడితే వారిని ఐసోలేషన్‌లో ఉంచుతోంది. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల్లో ఇద్దరికి ‘ఒమైక్రాన్‌’ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో మును పటిలా విమాన ప్రయాణీకులకు ఈ-పాస్‌ను తప్పనిసరి చేస్తూ విమాన యాన సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. స్వదేశీ విమాన ప్రయాణికులు ఇకపై తమతో ఈ-పాస్‌లను వెంటబెట్టుకునే ప్రయాణించాల్సి ఉంటుందని ఆ ఉత్తర్వులో స్పష్టం చేశారు. జాతీయ విమానాశ్రయంలో దిగే ప్రయాణికు లందరికీ థర్మల్‌స్కాన్‌ చేస్తారు. ఇక కేరళ నుంచి వచ్చే ప్రయాణికులు రెండు విడతల కరోనా నిరోధక టీకాలు వేసుకుంటేనే మీనాంబాక్కం, కోయం బత్తూరు, తిరుచ్చి, మదురై విమానాశ్రయాలకు అనుమతించనున్నారు. ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చే వారంతా ఈ-పాస్‌తోనే రావాలని స్థానిక విమానాశ్రయ ఉన్నతాధికారులు మైకుల్లో ప్రకటనలు కూడా చేస్తున్నారు. విమాన ప్రయాణీకులు ఈ-పాస్‌, కరోనా నిరోధక నిబంధనలు గురించి www.aai.aero అనే వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చునని అధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2021-12-18T14:28:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising