విమాన ప్రయాణికుడి వద్ద 7 తూటాలు స్వాధీనం
ABN, First Publish Date - 2021-08-10T14:26:30+05:30
స్థానిక మీనాంబాక్కం విమానాశ్రయంలో ఇండిగో విమానం ఎక్కేందుకు వచ్చిన ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ వద్ద ఏడు తుపాకీ తూటాలను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీకి చెందిన సుశీల్‌కుమార్ ఇటీవల ఓ సదస్సు
చెన్నై: స్థానిక మీనాంబాక్కం విమానాశ్రయంలో ఇండిగో విమానం ఎక్కేందుకు వచ్చిన ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ వద్ద ఏడు తుపాకీ తూటాలను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీకి చెందిన సుశీల్‌కుమార్ ఇటీవల ఓ సదస్సులో పాల్గొనేందుకు చెన్నైకి వచ్చాడు. సదస్సును ముగించుకుని విమానాశ్రయంలో ఢిల్లీకి వెళ్లేందుకు వచ్చారు. భద్రతాదళం సిబ్బంది తనిఖీ చేసినప్పుడు సుశీల్‌కుమార్ వద్ద ఏడు తుపాకీ తూటాలు లభించాయి. దీనితో ఆయనను విమానాశ్రయం పోలీసులకు అప్పగించారు. పోలీసులు జరిపిన విచారణలో సుశీల్‌కుమార్ తుపాకీ లైసెన్స్ కలిగి వున్నాడని, ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు తెలియకుండా తూటాలు ఉన్న బ్యాగ్‌ను తీసుకువచ్చాడని తెలిసింది. దీనితో ఆయనను పోలీసులు విడిచిపెట్టారు.
Updated Date - 2021-08-10T14:26:30+05:30 IST