ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైలు ఏపీ వెళ్లదని తెలిసి దూకేసిన ఐదుగురు ప్రయాణికులు.. ఒకరు మృతి..

ABN, First Publish Date - 2021-06-24T22:48:38+05:30

వేరే రైలు ఎక్కామన్న కంగారులో ఐదుగురు ప్రయాణికులు కదులుతున్న రైల్లో నుంచి దూకేసిన వైనమిది. ఈ ఘటనలో ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఝాన్సీ: వేరే రైలు ఎక్కామన్న కంగారులో ఐదుగురు ప్రయాణికులు కదులుతున్న రైల్లో నుంచి దూకేసిన వైనమిది. ఈ ఘటనలో ఒకరు మరణించగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం రాత్రి యూపీలోని ఝాన్సీ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. మృతుడిని గోరఖ్‌పూర్‌లోని దేవ్‌కాళి ప్రాంతానికి చెందిన అజయ్ కుమార్ (35)గా గుర్తించారు. అజయ్ తన అంకుల్ జగ్‌మోహన్, సోదరుడు విజయ్‌లతో పాటు సహచరులు సందీప్, సంజయ్‌లతో కలిసి ఆంధ్ర ప్రదేశ్ వెళ్లేందుకు ఝాన్సీకి వచ్చినట్టు ప్రభుత్వ రైల్వే పోలీసులు వెల్లడించారు. రాత్రి 12:30 గంటల సమయంలో ఏపీ రైలు అనుకుని వీరంతా ఢిల్లీ వైపు వెళ్తున్న ఆంధ్ర ప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కారు. అయితే ఆ రైలు ఢిల్లీ వెళ్తుందని తెలియడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా కదులుతున్న రైల్లోంచి దూకేశారు. అజయ్ రైలు కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా వారంతా తీవ్రంగా గాయపడడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. 

Updated Date - 2021-06-24T22:48:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising