ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వారానికి 5 రోజుల పని దినాల నోటిఫికేషన్

ABN, First Publish Date - 2021-10-23T21:54:42+05:30

కోవిడ్ ముప్పు దృష్ట్యా ప్రభుత్వ కార్యాలయాల్లో ఐదు రోజుల పని దినాలను వచ్చే ఏడాది మార్చి వరకూ కొనసాగించాలని ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్: కోవిడ్ ముప్పు దృష్ట్యా ప్రభుత్వ కార్యాలయాల్లో ఐదు రోజుల పని దినాలను వచ్చే ఏడాది మార్చి వరకూ కొనసాగించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం శనివారంనాడు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. కోవిడ్ వ్యాప్తిని నిరోధించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల ఐదు రోజుల (సోమవారం నుంచి శుక్రవారం) పని దినాలను 2022 మార్చి 31 వరకూ పొడిగిస్తున్నట్టు ఆ నోటిఫికేషన్ పేర్కొంది. గతంలో అక్టోబర్ 31 వరకూ ప్రభుత్వ కార్యాలయాల పనిదినాలను 5 రోజులకే పరిమితం చేస్తున్నట్టు ప్రభుత్వ ప్రకటించింది.


కాగా, మధ్యప్రదేశ్‌లో శుక్రవారం కోవిడ్ కొత్త కేసులు మరింత తగ్గాయి. కొత్తగా శుక్రవారం 8 కేసులు నమోదయ్యాయి. మొత్తం మృతుల సంఖ్య కూడా 10,525 వద్దే నిలకడగా ఉంది. ఇంతవరకూ 7,82,126 మంది కోలుకోగా, కేవలం 80 యాక్టివ్ కేసులే ఉన్నట్టు ఆరోగ్య శాఖ ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర రాజధాని భోపాల్‌లో మాస్క్‌లు ధరిస్తూ, సామాజిక దూరం పాటిస్తున్న వారు చెదురుమదురుగానే కనిపిస్తున్నారు. దీపావళి దగ్గర పడుతుండటంతో మార్కెట్లు మళ్లీ కళకళలాడుతున్నప్పటికీ అతి కొద్ది మంది మాత్రమే మాస్క్‌లు ధరిస్తున్నారు.

Updated Date - 2021-10-23T21:54:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising