ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మారనున్న మరో ఊరిపేరు... ఎక్కడ?... ఏమా కథ?

ABN, First Publish Date - 2021-08-02T17:10:23+05:30

ఉత్తరప్రదేశ్‌లోని అధికార ప్రభుత్వం తన పాలనా కాలంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫిరాజాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని అధికార ప్రభుత్వం తన పాలనా కాలంలో అనేక ఊర్ల పేర్లను మారుస్తూ వస్తోంది. ఇప్పుడు మరో పట్టణం పేరు మార్చేందుకు సన్నాహాలు చేస్తోంది. గాజు గాజులకు ప్రసిద్ధి పొందిన ఫిరోజాబాద్ పేరును మార్చనున్నట్లు సమాచారం. బ్లాక్ ఆధికారి డాక్టర్ లక్ష్మీ నారాయణ్ యాదవ్ సారధ్యంలోని కమిటీ ఫిరోజాబాద్ పేరును చంద్రనగర్‌గా మార్చాలనే ప్రస్తావన తెచ్చింది. 


ఫిరోజాబాద్‌కు చెందిన పండితుడు అనూప్ చంద్ జైన్ మాట్లాడుతూ గతంలో ఈ ఊరి పేరు చంద్వాడా అని ఉండేదన్నారు. అయితే ఫిరోజాబాద్ అనే పేరు 1566 అక్బరు శాసనాల్లో కనిపిస్తుందన్నారు. నాటి రోజుల్లో ప్రముఖ కవి ఫిరోజ్ షా ఈ ప్రాంతానికి వచ్చారని, అప్పటినుంచి ఈ ప్రాంతానికి ఫిరోజాబాద్ అనే పేరు వచ్చిందని తెలిపారు. కాగా ఈ పట్టణానికి చంద్రనగర్ అనే పేరు పెట్టాలని కోరడం గురించి ఎమ్మెల్యే మనీష్ అసీజ్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో గతంలో జైన రాజు చంద్రసేన్ బస చేశారని. అలాగే ఇక్కడ అనేక జైన మందిరాలున్నాయని, అందుకే ఈ ప్రాంతానికి చంద్రనగర్ అనే పేరు పెట్టాలని కోరుతున్నామన్నారు. 

Updated Date - 2021-08-02T17:10:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising