ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నింగినుంచి దూసుకొచ్చిన నిప్పుకణికలు

ABN, First Publish Date - 2021-07-30T22:02:07+05:30

విశ్వంలో భూమితో పాటుగా ఎన్నో గ్ర‌హాలు, ఉప‌గ్రహాలు, ఉల్క‌లు ఉన్నాయి. అప్పుడ‌ప్పుడు భూవాతావ‌ర‌ణంలోకి ఆస్ట్రాయిడ్స్ ప్ర‌వేశించి మండిపోతూ భూమిపై ప‌డుతుంటాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హ్యూస్టన్ : విశ్వంలో భూమితో పాటుగా ఎన్నో గ్ర‌హాలు, ఉప‌గ్రహాలు, ఉల్క‌లు ఉన్నాయి.  అప్పుడ‌ప్పుడు భూవాతావ‌ర‌ణంలోకి ఆస్ట్రాయిడ్స్ ప్ర‌వేశించి మండిపోతూ భూమిపై ప‌డుతుంటాయి.  జూరాసిక్ కాలంలో ఆస్ట్రాయిడ్స్ భూమిని ఢీకొట్ట‌ినందువల్లే ఆ భారీ జంతువులు న‌శించిపోయాయి.  అయితే... అప్పుడ‌ప్పుడు మ‌న‌కు ఆకాశం నుంచి రాలిప‌డుతున్న న‌క్ష‌త్రాలు, భూమివైపుకు దూసుకొస్తున్న ఉల్క‌లు క‌నిపిస్తుండడం తెలిసిందే.  ఇలాంటి దృశ్యాలు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో మ‌రోసారి క‌నిపించాయి. భారీ సైజుట్లో ఉన్న ఫైర్‌బాల్స్ మండుతూ భూమివైపుకు దూసుకురావ‌డంతో ప్ర‌జ‌లు ఆందోళ‌న‌కు గురయ్యారు. అయితే...  ఎవ‌రికీ ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌డం కానీ, నష్టం వాటిల్లడం కానీ జరగలేదు.  దీనికి సంబందించిన వీడియోల‌ను నాసా చిత్రీక‌రించింది.  సాధార‌ణ ప్ర‌జ‌లు కూడా ఈ ఫైర్‌బాల్స్‌ను వీడియోగా తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. మొత్తంమీద ఈ ఫైర్‌బాల్స్‌కు సంబందించిన వీడియోలు, ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.  ఇలాంటి దృశ్యాలు గ‌తంలో ఎప్పుడూ చూడ‌లేద‌ని కొంద‌రు చెబుతుంటే, మ‌రికొంద‌రు మాత్రం ఇవి స‌హ‌జ‌మేనని వ్యాఖ్యానిస్తున్నారు. 

Updated Date - 2021-07-30T22:02:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising