ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Fire at corona ward: ఇరాక్ కొవిడ్ వార్డులో ఘోర అగ్నిప్రమాదం...54 మంది మృతి

ABN, First Publish Date - 2021-07-13T13:23:35+05:30

ఇరాక్ దేశంలోని కొవిడ్ వార్డులో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 54 మంది రోగులు మరణించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాగ్ధాద్ (ఇరాక్): ఇరాక్ దేశంలోని కొవిడ్ వార్డులో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 54 మంది రోగులు మరణించారు.నస్రియా పట్టణంలోని అల్ హుస్సేనీ ఆసుపత్రి కొవిడ్ ఐసోలేషన్ వార్డులో మంటలంటుకున్న ఘటనలో 54 మంది రోగులు మరణించగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ ట్యాంకు పేలుడు వల్ల ఆసుపత్రిలో మంటలు అంటుకోవడంతో 54 మంది కరోనా రోగులు సజీవ దహనమయ్యారు. అల్ హుస్సేనీ ఆసుపత్రిని కొవిడ్ రోగుల కోసం 70 పడకలతో మూడు నెలల క్రితం ప్రారంభించారు. 


అగ్నిప్రమాదం వార్త తెలిసిన వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు హుటాహుటిన వచ్చి మంటలను ఆర్పుతున్నారు. ఈ ఘటనపై ఇరాక్ ప్రధానమంత్రి ముస్తఫా అల్ కాధేమీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రధాని ముస్తఫా విచారణకు ఆదేశించారు. గత ఏడాది ఏప్రిల్ నెలలో బాగ్దాద్ ఆసుపత్రిలో ఆక్సిజన్ ట్యాంకు పేలి 82 మంది మరణించారు.

Updated Date - 2021-07-13T13:23:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising