ఢిల్లీ విమానాశ్రయం ఐటీ భవంతిలో అగ్నిప్రమాదం
ABN, First Publish Date - 2021-06-15T00:07:41+05:30
సఫ్తర్‌గంజ్ విమానాశ్రయంలోని ఐటీ భవంతిలో సోమవారంనాడు స్వల్ప అగ్నిప్రమాదం..
న్యూఢిల్లీ: సఫ్తర్‌గంజ్ విమానాశ్రయంలోని ఐటీ భవంతిలో సోమవారంనాడు స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఐదు అగ్నిమాపక శకటాలను వెంటనే రంగంలోకి దింపారు. భవంతిలో ఉన్న వారందరినీ ఫైర్ లేడర్లతో సురక్షితంగా బయటకు తరలించామని, ఇంతవరకూ ఎవరూ మృతి చెందినట్టు సమాచారం లేదని ఢిల్లీ ఫైర్ సర్వీస్ చీఫ్ అతుల్ గార్గ్ తెలిపారు. ఢిల్లీలో గత రెండు రోజుల్లో అగ్నిప్రమాద ఘటనలు చోటుచేసుకోవడం ఇది రెండోసారి. గత శనివారంనాడు లజ్‌పత్ నగర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుని ఐదు దుకాణాలు దగ్ధమయ్యాయి.
Updated Date - 2021-06-15T00:07:41+05:30 IST