ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోవిడ్ మీద పోరాడండి, కాంగ్రెస్ మీద కాదు : రాహుల్ గాంధీ

ABN, First Publish Date - 2021-04-27T18:09:43+05:30

దేశంలో కోవిడ్-19 మహమ్మారిని కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : దేశంలో కోవిడ్-19 మహమ్మారిని కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందని, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. ప్రభుత్వం పోరాడవలసినది కోవిడ్‌పైనే కానీ, కాంగ్రెస్ లేదా ఇతర రాజకీయ ప్రత్యర్థుల మీద కాదనే విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరారు. 


రాహుల్ గాంధీ మంగళవారం ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘యుద్ధం కోవిడ్‌పైనే కానీ, కాంగ్రెస్ లేదా ఇతర రాజకీయ ప్రత్యర్థుల మీద కాదనే విషయాన్ని మోదీ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి’’ అని పేర్కొన్నారు. 


మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. కోవిడ్-19 మహమ్మారిని కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, ఈ మహమ్మారి పట్ల వ్యవహరించవలసిన తీరుకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తోందని దుయ్యబట్టింది. రోగులకు చికిత్సను నిరాకరిస్తున్నారని, ఆక్సిజన్, ఆసుపత్రి పడకలు, అత్యవసర మందులు అందుబాటులో లేవని ఆరోపించింది. కరోనా వైరస్ బాధితులకు సహాయపడటం కోసం కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. రాష్ట్రాల్లోని పీసీసీ కంట్రోల్ రూముల సమన్వయంతో రోగులకు సహాయం అందిస్తామని తెలిపింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ కంట్రోల్ రూమ్ బాధ్యతలను నలుగురికి అప్పగించారు. 


Updated Date - 2021-04-27T18:09:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising