ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Russiaలో ఘోర ప్రమాదం...బొగ్గుగనిలో 52 మంది దుర్మరణం

ABN, First Publish Date - 2021-11-26T13:56:32+05:30

రష్యా దేశంలోని కెమెరోవోలో జరిగిన బొగ్గు గని ప్రమాదంలో 52 మంది దుర్మరణం చెందారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాస్కో : రష్యా దేశంలోని కెమెరోవోలో జరిగిన బొగ్గు గని ప్రమాదంలో 52 మంది దుర్మరణం చెందారు.కెమెరోవో ప్రాంతంలోని బొగ్గు గనిలో  పొగ రావడంతో ఆరుగురు రక్షకులతో సహా మొత్తం 52 మంది మరణించారు.ప్రాథమిక సమాచారం ప్రకారం లిస్ట్‌వ్యాజ్నాయ గనిలో ప్రాణాలతో బయటపడిన వారు లేరని రష్యా అధికారులు చెప్పారు. మృతదేహాలు భూగర్భంలోనే ఉన్నాయి.రష్యా దేశంలో ఐదేళ్లలో జరిగిన అత్యంత ఘోరమైన గని ప్రమాదం ఇది.వెంటిలేషన్‌లో బొగ్గు ధూళి మండడంతో 250 మీటర్ల లోతులో పొగ రావడంతో 11 మంది మైనర్లు మరణించిన ఘటన గతంలో జరిగింది.


ఈ ప్రమాదంలో మరో 38 మంది ఆసుపత్రి పాలయ్యారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మరో 13 మంది ఔట్ పేషెంట్ చికిత్స పొందారు.బొగ్గు గనిలో ప్రమాదం జరిగినప్పుడు 285 మంది భూగర్భంలో ఉన్నారు.వారిలో ఎక్కువ మందిని గని నుంచి బయటకు తీశారు.మృతుల కుటుంబాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కెమెరోవో ప్రాంతంలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజులపాటు సంతాప దినాలను రష్యా సర్కారు ప్రకటించింది.


Updated Date - 2021-11-26T13:56:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising