ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అతి తీపితో ఫ్యాటీలివర్‌

ABN, First Publish Date - 2021-06-15T09:43:23+05:30

ఫ్యాటీలివర్‌.. ఈ వ్యాధికి ప్రధాన కారణమేంటని ప్రశ్నిస్తే ఠక్కున వచ్చే సమాధానం మద్యపానం. కానీ, మద్యం సేవించని చాలా మందిలో ఫ్యాటీలివర్‌ కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే.. బడికి వెళ్లే స్థూలకాయ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాన్‌-ఆల్కహాలిక్‌ కేటగిరీలో జబ్బు

తీపి, కార్బోహైడ్రేట్లతో యంలో కొవ్వు

ఐఐటీ-మండి పరిశోధకుల వెల్లడి


న్యూఢిల్లీ, జూన్‌ 14: ఫ్యాటీలివర్‌.. ఈ వ్యాధికి ప్రధాన కారణమేంటని ప్రశ్నిస్తే ఠక్కున వచ్చే సమాధానం మద్యపానం. కానీ, మద్యం సేవించని చాలా మందిలో ఫ్యాటీలివర్‌ కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే.. బడికి వెళ్లే స్థూలకాయ చిన్నారుల్లోనూ ఇది బయటపడుతోంది. ఇందుకు ప్రధాన కారణాన్ని ఐఐటీ-మండి శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అతిగా తీపిని తీసుకోవడం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోతోందని నిర్ధారించారు. వీరి పరిశోధన పత్రాలు ‘బయోలాజికల్‌ కెమిస్ర్టీ’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. కొన్ని ఎలుకల మీద చేసిన పరిశోధనలో.. అతిగా తీపిని తీసుకోవడం, పరిమితికి మించిన కార్బొహైడ్రేడ్లు కాలేయంలో కొవ్వుగా మారుతున్నట్లు గుర్తించామని ఐఐటీ-మండిలోని స్కూల్‌ ఆఫ్‌ బేసిక్‌ సైన్సెస్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ప్రసేన్‌జిత్‌ మండల్‌ వెల్లడించారు.


ఈ పరిశోధనకు ఆయన నేతృత్వం వహించారు. కేంద్ర ప్రభుత్వం నాన్‌-ఆల్కహాలిక్‌ ఫ్యాటీలివర్‌ వ్యాధి(ఎన్‌ఏఎఫ్‌ఎల్‌డీ)ని నేషనల్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ ప్రివెన్షన్‌ అండ్‌ కంట్రోల్‌ ఆఫ్‌ కేన్సర్‌, డయాబెటిస్‌, కార్డియోవాస్క్యులర్‌ డిసీస్‌ అండ్‌ స్ర్టోక్‌(ఎన్‌పీసీడీసీఎస్‌)లో చేర్చిన నేపథ్యంలో తాము నాన్‌-ఆల్కహాలిక్‌ ఫ్యాటీలివర్‌పై పరిశోధన ప్రారంభించామని ఆయన వివరించారు. అతిగా తీపి తినేవారి కాలేయంలో డీ-నోవో లిపోజెనెసిస్‌(డీఎన్‌ఎల్‌) కారణంగా కొవ్వు పేరుకుపోతుందని గుర్తించామన్నారు.

Updated Date - 2021-06-15T09:43:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising