ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పన్ను ఎగవేత కేసులో మాజీ సీఎం కుమారుడికి బెయిల్

ABN, First Publish Date - 2021-11-09T00:01:07+05:30

అస్సాం స్టేట్ కార్పొరేటివ్ అండ్ అగ్రికల్చర్ డెవలప్‌మెంట్ బ్యాంక్ నుంచి 1996లో తీసుకున్న 9.37 లక్షల రూపాయల లోన్ వ్యవహరాంలో అశోక్ సైకియాను అతడి నివాసంలోనే ఆదివారం సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. దీనిపై 1998లో బ్యాంకు ఉద్యోగులు కేసు నమోదు చేశారు. అయితే తాను 2011లోనే లోన్ మొత్తాన్ని తిరిగి చెల్లించానని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గువహాటి: పన్ను ఎగవేత కేసులో అరెస్టైన అస్సాం మాజీ ముఖ్యమంత్రి హితేశ్వర్ సైకియా కుమారుడు అశోక్ సైకియాకు బెయిల్ వచ్చింది. అరెస్టైన మరుసటి రోజే గువహాటిలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. ఈ విషయమై అశోక్ శైకియా సోదరుడు, అస్సాం అసెంబ్లీ ప్రతిపక్ష నేత దేబాబ్రాత సైకియా మాట్లాడుతూ ‘‘లాయర్‌తో మాట్లాడాను. బెయిల్ వచ్చిందని చెప్పారు. కొద్ది సమయంలోనే అశోక్ జైలు నుంచి విడుదల అవుతారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం కూడా అందింది’’ అని తెలిపారు.


అస్సాం స్టేట్ కార్పొరేటివ్ అండ్ అగ్రికల్చర్ డెవలప్‌మెంట్ బ్యాంక్ నుంచి 1996లో తీసుకున్న 9.37 లక్షల రూపాయల లోన్ వ్యవహరాంలో అశోక్ సైకియాను అతడి నివాసంలోనే ఆదివారం సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. దీనిపై 1998లో బ్యాంకు ఉద్యోగులు కేసు నమోదు చేశారు. అయితే తాను 2011లోనే లోన్ మొత్తాన్ని తిరిగి చెల్లించానని, 2015లో బ్యాంకు దీనికి సంబంధించిన ధ్రువపత్రం కూడా ఇచ్చిందని అశోక్ సైకియా తెలిపారు. అంతే కాకుండా తనకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారని, ఆధారలు లేకుండానే తనపై కేసు నమోదు చేశారని అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-11-09T00:01:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising