ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

3 లక్షల వరకు జీరో వడ్డీకే రుణం: ప్రభుత్వం

ABN, First Publish Date - 2021-03-09T02:53:31+05:30

మహిళల పేరుతో ఇళ్లు కొనుక్కుంటే స్టాంప్ డ్యూటీలో మినహాయింపులు ఇస్తాం. రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఇది వర్తిస్తుంది. ఇంటి యజమానులుగా మారడానికి ఇది ఉపయోగపడుతుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మహారాష్ట్రలోని రైతులకు మూడు లక్షల రూపాయల వరకు సున్నా వడ్డీకే వ్యవసాయ రుణాలు అందజేయనున్నట్లు ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి అజిత్ పవార్ ప్రకటించారు. సోమవారం రాష్ట్ర బడ్జెట్ సందర్భంగా రాష్ట్ర అసెంబ్లీలో ప్రసంగిస్తూ ఈ ప్రకటన చేశారు. మూడు లక్షల వరకు రైతులు తీసుకునే వ్యవసాయ రుణాలకు ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుందని, రుణం మినహా దానిపై నాయాపైసా రైతులు చెల్లించాల్సిన అవసరం లేదని అజిత్ పవార్ స్పష్టం చేశారు.


‘‘రైతులకు మూడు లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణ సదుపాయాన్నీ జీరో శాతం వడ్డీతో కల్పిస్తున్నాం. ఆ మొత్తంపై రుణాన్ని ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుంది. రైతులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అసవరం లేదు. రైతుల ఆదాయం పెరిగేందుకు మా ప్రభుత్వం కృషిచేస్తుందని, రైతులకు మేము అండగా ఉంటామని తెలియజేస్తున్నందుకు గర్వంగా ఉంది’’ అని అజిత్ పవార్ అన్నారు.


ఇక మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మాట్లాడుతూ ‘‘మహిళల పేరుతో ఇళ్లు కొనుక్కుంటే స్టాంప్ డ్యూటీలో మినహాయింపులు ఇస్తాం. రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఇది వర్తిస్తుంది. ఇంటి యజమానులుగా మారడానికి ఇది ఉపయోగపడుతుంది. మహిళలు యజమానులుగా ఎదిగేందుకు మా ప్రభుత్వం సహకారం అందిస్తుంది’’ అని అన్నారు.

Updated Date - 2021-03-09T02:53:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising