ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ రైల్వే స్టేషన్ ఇకపై అయోధ్య కంటోన్మెంట్

ABN, First Publish Date - 2021-10-23T19:46:59+05:30

ఉత్తర ప్రదేశ్‌లోని ఫైజాబాద్ రైల్వే స్టేషన్ పేరును

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో : ఉత్తర ప్రదేశ్‌లోని ఫైజాబాద్ రైల్వే స్టేషన్ పేరును అయోధ్య కంటోన్మెంట్‌గా మార్చుతున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కార్యాలయం (సీఎంఓ) శనివారం ట్వీట్ చేసింది. 2018 నవంబరులో ఫైజాబాద్ జిల్లా పేరును అయోధ్యగా మార్చిన సంగతి తెలిసిందే. అదేవిధంగా అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చారు. ముఘల్‌సరై రైల్వే స్టేషన్‌కు 2018 జూన్‌లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పేరు పెట్టారు. 


యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇటీవల ఝాన్సీ రైల్వే స్టేషన్ పేరును రాణీ లక్ష్మాబాయ్ రైల్వే స్టేషన్‌గా మార్చింది. పట్టణాలు, జిల్లాలు, రైల్వే స్టేషన్లకు ఈ విధంగా పేర్లు మార్చడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అయితే బీజేపీ నేతలు తమ ప్రభుత్వ చర్యలను సమర్థిస్తున్నారు. తాము పాత పేర్లనే పునరుద్ధరిస్తున్నామని, చారిత్రక వక్రీకరణలను సరిదిద్దుతున్నామని చెప్తున్నారు. 


Updated Date - 2021-10-23T19:46:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising