ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫేస్‌బుక్‌కు షాకిచ్చిన కోర్టు.. 650 మిలియన్ డాలర్ల నష్టపరిహారం!

ABN, First Publish Date - 2021-02-28T11:22:52+05:30

ప్రముఖ సోషల్ మీడియా కంపెనీ ఫేస్‌బుక్‌కు అగ్రరాజ్యం అమెరికాలో షాక్ తగిలింది. వ్యక్తిగత గోప్యతకు ఫేస్‌బుక్ భంగం కలిగించిందంటూ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. ఈ సంస్థ 650 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలంటూ ఆదేశించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: ప్రముఖ సోషల్ మీడియా కంపెనీ ఫేస్‌బుక్‌కు అగ్రరాజ్యం అమెరికాలో షాక్ తగిలింది. వ్యక్తిగత గోప్యతకు ఫేస్‌బుక్ భంగం కలిగించిందంటూ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. ఈ సంస్థ 650 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలంటూ ఆదేశించింది. ఫొటోల్లో అనుమతి లేకుండా యూజర్లను ఫేస్‌బుక్ ఫేస్‌ట్యాగ్ చేస్తోందని, ఇది ప్రైవసీ పాలసీని తుంగలో తొక్కడమేనని కొందరు యూజర్లు ఆరోపించారు. ఈ మేరకు 2015లో వేసిన కోర్టు పిటిషన్‌కు 16లక్షల మంది మద్దతుగా నిలిచారు. వీరందరికీ కలిపి 650 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ లెక్కన ఒక్కొక్కరికి 345 డాలర్ల వరకూ వచ్చే అవకాశం ఉంది. ప్రైవసీ పాలసీకి సంబంధించిన కేసుల్లో ఇంత మొత్తంలో సెటిల్‌మెంట్ జరగడం ఇదే తొలిసారని తీర్పిచ్చిన జడ్జి కూడా పేర్కొన్నారు.

Updated Date - 2021-02-28T11:22:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising