ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

ABN, First Publish Date - 2021-12-15T17:33:30+05:30

రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ప్రతిపక్షనేత సిద్దరామయ్య ధ్వజమెత్తారు. మంగళవారం శాసనసభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- భారీ వర్షాలతో 12.5 లక్షల హెక్టార్ల పంటనష్టం 

- పైసా విదల్చని కేంద్రం 

- శాసనసభలో ధ్వజమెత్తిన సిద్దరామయ్య 


బెంగళూరు: రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ప్రతిపక్షనేత సిద్దరామయ్య ధ్వజమెత్తారు. మంగళవారం శాసనసభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా 12.5 లక్షల హెక్టార్లలో పంటనష్టం సంభవించిందని పేర్కొన్నారు. ఇంత తీవ్రనష్టం జరిగినా రైతాంగాన్ని ఆదుకునేందుకు కేంద్రప్రభుత్వం నయాపైసా విదల్చలేదని విరుచుకుపడ్డారు. పంటనష్టం రూ.11,916 కోట్లకుపైగా ఉందని ప్రభుత్వమే స్వయంగా అంగీకరించిందన్నారు. గత మూడేళ్ల అవధిలో అతివృష్టి, అనావృష్టి కారణంగా రైతాంగానికి 2.5 లక్షల కోట్ల నష్టం సంభవించిందన్నారు. రాష్ట్రంలో బీజేపీకి పెద్దసంఖ్యలో ఎంపీలు ఉన్నారని, కేంద్రానికి పరిస్థితి తీవ్రతను వివరించి నిధులు రాబట్టడంలో వీరంతా విఫలమయ్యారన్నారు. అతివృష్టి కారణంగా పంటనష్టం సంభవించిన రైతులకు తక్షణ నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ గైడ్‌లైన్స్‌ను పక్కనపెట్టి రైతులకు భూరిగా పరిహారంతో ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బెళగావి శాసనసభలో వరుసగా రెండోసారి కూడా ఆయన రైతాంగం సమస్యలను ప్రస్తావించారు. గత ఏడేళ్లుగా ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతాంగానికి ఇవ్వాల్సిన నష్ట పరిహారానికి సంబంధించి ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎస్‌లు పాత నియమావళిని అనుసరిస్తున్నాయని కాలానికి అనుగుణంగా వీటిలో మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల సమస్యలు పట్టడం లేదని ఆయన ఆరోపించారు. అవసరం లేని మతమార్పిడి నిషేధబిల్లుపై ఉన్నంత ఆసక్తి రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వానికి సామాన్యులు, రైతాంగం సమస్యలు పట్టడం లేదన్నారు. భారీ వర్షాలతో అనేక జిల్లాలు అతలాకుతలమైనా కేవలం మొక్కుబడి పర్యటనలతో ముఖ్యమంత్రి, మంత్రులు చేతులుదులుపుకున్నారని మండిపడ్డారు. ఇదే సమయంలో ఆయన ప్రధాన ప్రతిపక్షనేతగా అధికారులతో సమావేశం కావడం సమంజసమేనని, దీన్ని రాజకీయ కోణంలో చూడరాదని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షనాయకుడి అధికారాలపై సభలో కొద్దిసేపు ఆసక్తికరమైన చర్చ జరిగింది. 

Updated Date - 2021-12-15T17:33:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising