ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు తక్షణం పరిహారమివ్వాలి: Siddu

ABN, First Publish Date - 2021-11-25T17:24:31+05:30

భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు తక్షణం పరిహారం అందించి ఆదుకోవాలని రాష్ట్ర ప్రతిపక్షనేత సిద్దరామయ్య డిమాండ్‌ చేశారు. వర్ష పీడిత ప్రాంతాల్లో ఒకటైన కోలారు జిల్లాలో ఆయన బుధవారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

             - కోలారు జిల్లాలో ప్రతిపక్షనేత పర్యటన 


బంగారపేట(బెంగళూరు): భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు తక్షణం పరిహారం అందించి ఆదుకోవాలని రాష్ట్ర ప్రతిపక్షనేత సిద్దరామయ్య డిమాండ్‌ చేశారు. వర్ష పీడిత ప్రాంతాల్లో ఒకటైన కోలారు జిల్లాలో ఆయన బుధవారం పర్యటించారు. తొలుత కోలారు పట్టణానికి చేరుకున్న ఆయన స్థానికంగా అధికారుల నుంచి సమాచారం సేకరించారు. అనంతరం బంగారపేట తాలూకాకు చేరుకున్నారు. అంచాళ గ్రామంలోని పొలాలను పరిశీలించారు. కోతదశకు చేరుకున్న రాగిపంట నీటిపాలైనట్టు గుర్తించారు. తిరిగి మొలకెత్తుతుండడంపై విచారం వ్యక్తం చేశారు. స్థానిక రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 6 లక్షల హెక్టార్లల పంట నష్టమైనట్టు అంచనాగా పేర్కొన్నారు. కోలారు జిల్లాలో టమోటా, బంగాళాదుంప, వరి, రాగి, బూడిద గుమ్మడి, పప్పాయ, చేమంతి, పలు రకాల కూరగాయల పంటలు దెబ్బతిన్నాయన్నారు. నష్టపోయిన రైతులకు తక్షణం పరిహారం అందించి ఆదుకోవాలన్నారు. ఈ సందర్భంగా బంగారపేట ఎమ్మెల్యే ఎస్‌ఎన్‌ నారాయణస్వామి, మాలూరు ఎమ్మెల్యే నంజేగౌడ, కోలారు ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ, శ్రీనివాసపుర ఎమ్మెల్యే రమేశ్‌కుమార్‌, రైతుసంఘం జిల్లాధ్యక్షుడు మరగల్‌ శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు. 

Updated Date - 2021-11-25T17:24:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising