ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పార్టీ ఉంటుందో లేదో ప్రజలే నిర్ణయిస్తారు’

ABN, First Publish Date - 2021-12-25T18:23:48+05:30

జేడీఎస్‌ పార్టీ భవిష్యత్తులో ఉంటుందో లేదో అనేది ప్రజలు నిర్ణయిస్తారని మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్‌ కీలక నేత కుమారస్వామి స్పష్టం చేశారు. జేడీఎస్‌కు భవిష్యత్తు లేదని మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపైకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

              - మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి 


బెంగళూరు: జేడీఎస్‌ పార్టీ భవిష్యత్తులో ఉంటుందో లేదో అనేది ప్రజలు నిర్ణయిస్తారని మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్‌ కీలక నేత కుమారస్వామి స్పష్టం చేశారు. జేడీఎస్‌కు భవిష్యత్తు లేదని మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపైకు మారస్వామి విరుచుకుపడ్డారు. శుక్రవారం రామనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏ పార్టీ అయినా ప్రజాభిప్రాయం మేరకు కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్‌కు ఎప్పుడూ జేడీఎస్‌పైనే గురి అన్నారు. జేడీఎస్‌ను ముగిస్తామనేవారంతా ఎక్కడి నుంచి రాజకీయాలు ప్రారంభించారో తెలుసుకుంటే మంచిదన్నారు. 2013లో కాంగ్రెస్‌ పార్టీ కృష్ణావైపు నడక అంటూ... పాదయాత్ర చేశారని, ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడినా ఏం సాధించారో అందరికీ తెలిసిందేనన్నారు. ప్రస్తుతం మేకెదాటుకు పాదయాత్ర పేరిట ఈ ప్రాంత ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమవుతున్నారన్నారు. 1996లో దేవేగౌడ సీఎంగా ఉన్నప్పుడే మేకెదాటుకు బ్లూ ప్రింట్‌ తయారు చేయించారన్నారు. 1962లో ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేగా శాసనసభలో అనుమతి కోసం దేవేగౌడ పోరాటం చేశారన్నారు. ఇలా హారంగి, హేమావతి, ఇగ్గలూరు జలాశయాలు ఏర్పడ్డాయని ఇవి దేవేగౌడ రాజకీయ చరిత్రలో సాధించిన విజయాలన్నారు. ఇటీవల విడుదలైన దేవేగౌడ పుస్తకంలో తెలుసుకోవచ్చునన్నారు. మేకెదాటుకు పాదయాత్రతో మరో మోసానికి కాంగ్రెస్‌ సిద్ధమైందన్నారు. 

Updated Date - 2021-12-25T18:23:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising