ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chennai: మాజీ ముఖ్యమంత్రికి అస్వస్థత

ABN, First Publish Date - 2021-10-29T14:52:49+05:30

అన్నాడీఎంకే శాసనసభాపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి గురువారం ఉదయం అస్వస్థతకు గురయ్యారు. దాంతో సేలం పర్యటనను ఆకస్మికంగా రద్దు చేసుకుని చెన్నై తిరిగొచ్చారు. కార్పొరేషన్‌, మునిసిపాలిటీ ఎన్నికల్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: అన్నాడీఎంకే శాసనసభాపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి గురువారం ఉదయం అస్వస్థతకు గురయ్యారు. దాంతో సేలం పర్యటనను ఆకస్మికంగా రద్దు చేసుకుని చెన్నై తిరిగొచ్చారు. కార్పొరేషన్‌, మునిసిపాలిటీ ఎన్నికల్లో అనుసరించాల్సి వ్యూహాలపై చర్చించేందుకు ఎడప్పాడి బుధవారం సేలం నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఆ సమయంలోనూ ఆయన కొంత నలతగా కనిపించారు. తాను కడుపునొప్పితో బాధపడుతున్నానని, అయినా కార్యకర్తలతో చర్చించాల్సి వున్నందున తాను సమావేశానికి హాజరయ్యానని ఆ సందర్భంగా పేర్కొన్నారు. తరువాత ఇంటికెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఉదయం తొమ్మిది గంటలకు ఆయన సేలం నుంచి బయల్దేరి చెన్నై చేరుకున్నారు. ఇటీవలే ఆయన చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యపరీక్షలు కూడా చేయించుకున్న విషయం తెలిసిందే. గతంలో ఆయన హెర్నియా ఆపరేషన్‌ కూడా చేసుకున్నారు. ఆ తర్వాత కూడా తరచూ ఆయన కడుపునొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ఆయన ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. 

Updated Date - 2021-10-29T14:52:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising