ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి ఒక్కరికీ కోరుకున్న శాఖలు రావు: బొమ్మై

ABN, First Publish Date - 2021-08-08T21:25:53+05:30

శాఖల కేటాయింపు విషయంలో పలువురు మంత్రులు అసంతృప్తితో ఉన్నారంటూ వస్తున్న..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: శాఖల కేటాయింపు విషయంలో పలువురు మంత్రులు అసంతృప్తితో ఉన్నారంటూ వస్తున్న వార్తలపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందించారు. ప్రతి ఒక్కరికీ కోరుకున్న శాఖలు కేటాయించడం సాధ్యం కాదన్నారు. మంత్రులతో తాను ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నానని చెప్పారు. ''ఆనంద్ సింగ్‌తో మాట్లాడాను. ఆయన అంశం త్వరలోనే పరిష్కారం అవుతుందని అనుకుంటున్నాను. ఎంబీటీ నాగరాజుకు కూడా ఫోన్ చేసి మాట్లాడతాను'' అని ఆయన తెలిపారు.


కాగా, శాఖల కేటాయింపు అనంతరం ఆనంద్ సింగ్, ఎంబీటీ నాగరాజ్‌లు బాహాటంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎకాలజీ, పర్యావరణం, పర్యాటక శాఖలు తనకు కేటాయించడంపై ఆనంద్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ శాఖలు తాను అడగలేదని చెప్పారు. పార్టీ వేదికపై తాను చేసిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోలేదని, దీనిపై సీఎంను కలవాలని అనుకుంటున్నానని చెప్పారు. తన అభ్యర్థినను ముఖ్యమంత్రి పునఃపరిశీలించాలని కోరారు. గత బుధవారంనాడు రాష్ట్ర మంత్రివర్గాన్ని 29 మందితో బసవరాజ్ బొమ్మై విస్తరించారు. యడియూరప్ప మంత్రివర్గంలోని 23 మందిని అలాగే ఉంచి, మరో ఆరుగురు కొత్తవారికి మంత్రివర్గంలో చోటు కల్పించారు.


Updated Date - 2021-08-08T21:25:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising