ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి ఒక్కరు రాజ్యాంగ పీఠిక చదవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్

ABN, First Publish Date - 2021-01-27T03:16:01+05:30

దేశంలోని భిన్న ప్రాంతాల సంస్కృతినీ ఐక్యతను జాతీయ గీతంలో ప్రతిబింబిస్తుందని అన్నారు. జెండావందన వేడుకలో భారత చిత్రపటాన్ని గీసి జన గణ మన చదివుతుండే దేశంలోని వివిధ ప్రాంతాల సరిహద్దులు కళ్లకు తడతాయని మోహన్ భాగవత్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజున ప్రతి ఒక్కరు భారత రాజ్యాంగ పీఠికను చదవాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భాగవత్ పిలుపునిచ్చారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం గుజరాత్‌లోని అహ్మదాబాద్ వచ్చిన ఆయన.. మంగళవారం నగరంలోని రాష్ట్ర ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశాన్ని ఎటువైపు తీసుకెళ్లాలనే ఆలోచనా, దృక్పథం దేశ ప్రజలైన మనలో ఉండాలని అన్నారు.


‘‘దేశ ప్రజలందరూ తప్పనిసరిగా భారత రాజ్యాంగ పీఠిక చదవాలి. ఆ పీఠికే దేశాన్ని ఎటువైపు తీసుకెళ్లాలనే విషయాన్ని మనకు బోధిస్తుంది. ఈ దేశ పౌరులుగా అది మన బాధ్యత’’ అని మోహన్ భాగవత్ అన్నారు. ఇక దీనితో పాటు జాతీయ గీతం ‘జన గణ మన’ను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశంలోని భిన్న ప్రాంతాల సంస్కృతినీ ఐక్యతను జాతీయ గీతంలో ప్రతిబింబిస్తుందని అన్నారు. జెండావందన వేడుకలో భారత చిత్రపటాన్ని గీసి జన గణ మన చదివుతుండే దేశంలోని వివిధ ప్రాంతాల సరిహద్దులు కళ్లకు తడతాయని మోహన్ భాగవత్ అన్నారు.


ఇక జాతీయ జెండాలోని మూడు రంగుల ప్రాముఖ్యతను మోహన్ భాగవత్ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. ఎరుపు ధైర్యానికి, శక్తికి చిహ్నమని అన్నారు. త్యాగానికి, కష్టానికి ఇది సంకేతమని అన్నారు. తెలుపు మచ్చలేని మనస్తత్వానికి గుర్తని అన్నారు. ఎలాంటి బేషజాలం లేకుండా దేశానికి సేవ చేయమని తెలుపు చెబుతోందని అన్నారు. ఇక ఆకుపచ్చ లక్ష్మీ దేవికి మరో రూపమని అన్నారు. ఇది దేశం సంపన్నంగా ఉండాలని, ఎవరినీ ఆకలికి గురి చేయడకూడదని తెలుపుతుందని అన్నారు. ఈ మూడు రంగులతో దేశం ముందుకు పోతోందని మోహన్ భాగవత్ చెప్పుకొచ్చారు.

Updated Date - 2021-01-27T03:16:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising