ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విమానంలో ‘భారత్ మాతా కీ జై’ నినాదాలు

ABN, First Publish Date - 2021-08-22T16:56:25+05:30

ఆఫ్ఘనిస్థాన్‌లో క్షణక్షణం భయం భయంగా గడిపినవారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఆఫ్ఘనిస్థాన్‌లో క్షణక్షణం భయం భయంగా గడిపినవారు భారత గడ్డపై అడుగు పెట్టగానే చాలా సంతోషంతో ‘భారత్ మాతా కీ జై’ అంటూ నినాదాలు చేశారు. దాదాపు 90 మంది ప్రయాణికులతో కాబూల్ విమానాశ్రయంలో బయల్దేరిన విమానం న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగానే అందరూ ఆనందంతో ‘భారత్ మాతా కీ జై’ అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు. ఈ వివరాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఆదివారం ఓ ట్వీట్‌లో తెలిపారు. 


కాబూల్ నుంచి 87 మంది భారతీయులను తజకిస్థాన్‌కు తరలించి, అక్కడి నుంచి న్యూఢిల్లీకి తీసుకొస్తున్నట్లు అంతకుముందు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఓ ట్వీట్‌లో తెలిపారు. వీరితోపాటు ఇద్దరు నేపాలీలను కూడా తీసుకొస్తున్నట్లు తెలిపారు. కాబూల్ నుంచి భారత వాయు సేన విమానంలో వీరిని తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. తజకిస్థాన్‌లోని దుషాంబేలో ఉన్న భారత దౌత్య కార్యాలయం సహకారంతో మరిన్ని విమానాలను నడుపుతామని చెప్పారు. 


ప్రభుత్వ వర్గాలు శనివారం తెలిపిన వివరాల ప్రకారం, ఆఫ్ఘనిస్థాన్‌లో చిక్కుకున్న భారతీయులను తీసుకెళ్ళేందుకు రోజుకు రెండు విమానాల చొప్పున నడిపేందుకు నాటో దళాలు అనుమతి ఇచ్చాయి. హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రస్తుతం నాటో దళాలు నిర్వహిస్తున్నాయి. 


Updated Date - 2021-08-22T16:56:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising