ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆస్ట్రాజెనెకాపై కోర్టుకెక్కేందుకు రెడీ అయిన ఈయూ

ABN, First Publish Date - 2021-04-23T01:42:04+05:30

ఒప్పందం ప్రకారం కొవిడ్ వ్యాక్సిన్ డోసులను సరఫరా చేయలేకపోయిన బ్రిటిష్-స్వీడిష్ ఫార్మాస్యూటికల్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్రిటన్: ఒప్పందం ప్రకారం కొవిడ్ వ్యాక్సిన్ డోసులను సరఫరా చేయలేకపోయిన బ్రిటిష్-స్వీడిష్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఆస్ట్రాజెనెకాపై చర్యలకు యూరోపియన్ యూనియన్ కమిషన్ రెడీ అవుతోంది. చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఆస్ట్రాజెనెకాను కోర్టుకు లాగాలని యోచిస్తోంది. ఆస్ట్రాజెనెకా-యూరోపియన్ కమిషన్ మధ్య జరిగిన ఒప్పందం బెల్జియన్ కోర్టు అధికార పరిధిలో ఉండడంతో లా సూట్ అక్కడే ప్రారంభం అవుతుందని అధికారులు తెలిపారు.


అయితే, కమిషన్ అధికార ప్రతినిధి ఎరిక్ మామెర్ మాట్లాడుతూ.. ఈ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదన్నారు. మరో అధికార ప్రతినిధి స్టెఫాన్ డి కీర్స్‌మాకెర్ మాట్లాడుతూ.. ఆస్ట్రాజెనెకా ఒప్పందం మేరకు కొవిడ్ డోసులను సరఫరా చేయలేకపోయిందన్నారు. అందుకనే తదుపరి చర్యలకు వెళ్లాలనుకుంటున్నట్టు చెప్పారు. కాగా, ఆస్ట్రాజెనెకాపై చర్యలు తీసుకునే విషయాన్ని సభ్యదేశాలకు తెలియజేసినట్టు ఈయూ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు. 

Updated Date - 2021-04-23T01:42:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising