ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi: వరుసగా నాలుగో రోజు పెరిగిన పెట్రో ధరలు

ABN, First Publish Date - 2021-10-08T13:08:54+05:30

దేశంలో వరుసగా నాలుగో రోజైన శుక్రవారం మళ్లీ పెట్రో ధరలు పెరిగాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : దేశంలో వరుసగా నాలుగో రోజైన శుక్రవారం మళ్లీ పెట్రో ధరలు పెరిగాయి. గత నాలుగురోజులుగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో వినియోగదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నాలుగురోజులుగా పెట్రో ధరల పెంపుతో సామాన్యులు తమపై పడే భారంతో సతమతమవుతున్నారు. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుపై 30 పైసలు పెరిగి రూ.103.54కు చేరింది. డీజిల్ లీటరు ధర రూ.91.77 నుంచి 92.12రూపాయలకు పెరిగింది.దేశ ఆర్థిక రాజధాని నగరమైన ముంబైలో శుక్రవారం పెట్రోలు లీటరు ధర రూ.109.54, డీజిల్ లీటరు ధర రూ.99.22కు పెరిగింది. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం,  హిందుస్తాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ చమురు శుద్ధిదారులు అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు, రూపాయి-డాలర్ మారకపు రేట్లను పరిగణనలోకి తీసుకొని ప్రతిరోజూ ఇంధన రేట్లను సవరిస్తున్నారు.


చెన్నై నగరంలో పెట్రోలు లీటరు ధర రూ.101.01, డీజిల్ లీటరు ధర రూ.96.60కు పెరిగింది. కోల్‌కతా నగరంలో పెట్రోల్ లీటరు ధర 104.23రూపాయలు, డీజిల్ ధర 95.23రూపాయలకు పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి అమలు చేస్తున్నారు.యునైటెడ్ స్టేట్స్ అత్యవసర ముడి నిల్వలను విడుదల చేయడం, పెట్రో సరఫరాను సులభతరం చేయడానికి ఎగుమతులను నిషేధించడం అసాధ్యమని మార్కెట్ భావించడంతో మళ్లీ చమురు ధరలు పుంజుకున్నాయి.


Updated Date - 2021-10-08T13:08:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising