ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓపీఎస్‌, ఈపీఎస్‌ ఏకగ్రీవం

ABN, First Publish Date - 2021-12-07T14:14:22+05:30

అందరూ ఊహించినట్టే అన్నాడీఎంకే సమన్వయకర్త, ఉప సమన్వయకర్తగా మాజీ ముఖ్యమంత్రులు ఒ.పన్నీర్‌ సెల్వం, ఎడప్పాడి పళనిస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో అన్నాడీఎంకేలో వారే సర్వాధికారులయ్యారు. ఈ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                       - అన్నాడీఎంకేపై సర్వాధికారం వారిదే


చెన్నై: అందరూ ఊహించినట్టే అన్నాడీఎంకే సమన్వయకర్త, ఉప సమన్వయకర్తగా మాజీ ముఖ్యమంత్రులు ఒ.పన్నీర్‌ సెల్వం, ఎడప్పాడి పళనిస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో అన్నాడీఎంకేలో వారే సర్వాధికారులయ్యారు. ఈ మేరకు వారి ఎన్నికను సోమవారం సాయంత్రం ఎన్నికల నిర్వాహకులుగా వ్యవహరించిన మాజీ మంత్రులు సి.పొన్నయ్యన్‌, పొల్లాచ్చి జయరామన్‌ అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటన రాకమునుపే రాయపేటలోని అన్నా డీఎంకే ప్రధాన కార్యాలయం ‘ఎంజీఆర్‌ మాళిగై’ వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ఆదివారం నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తికావటంతో వీరి నామినేషన్లు మాత్రమే అంగీకరించినట్టు ప్రకటించారు. వీరితోపాటు మరికొంత మంది కూడా నామినేషన్లు వేసినా, వివిధ కారణాలతో అవి తిరస్కరణకు గురయ్యాయి. ఈ ఎన్నికల కోసం 150కి పైగా నామినేషన్ల పత్రాలను విక్రయించారు. కానీ వాటిలో అత్యధిక సంఖ్యలో ఎడప్పాడి, పన్నీర్‌సెల్వంకు మద్దతుగానే నామినేషన్లు వచ్చాయని ఎన్నికల నిర్వాహకులు పొన్నయ్యన్‌, పొల్లాచ్చి జయరామన్‌ ప్రకటించారు. దీంతో సోమవారం మధ్యాహ్నం నాలుగు గంటల సమయంలో అన్నా డీఎంకే సమన్వయకర్త, ఉప సమన్వయకర్తగా ఒ.పన్నీర్‌సెల్వం, ఎడప్పాడి పళనిస్వామి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడగానే పార్టీ కార్యాలయం వద్ద గుమిగూడిన వేలాదిమంది కార్యకర్తలు ఈపీఎస్‌ వర్థిల్లాలి... ఓపీఎస్‌ వర్థిల్లాలి, జయమ్మ వర్థిల్లాలి అంటూ  నినాదాలు చేశారు. మహిళా కార్యకర్తలు అందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. ఇటీవల జరిగిన అన్నాడీఎంకే కార్య నిర్వాహక మండలి సమావేశంలో పలు సంచల నాత్మకమైన తీర్మానాలు చేసిన విషయం తెలిసిందే. ప్రత్యేకించి పార్టీ ద్వంద్వ నాయకత్వానికి మద్దతుగా, సమన్వయకర్త, ఉప సమన్వయకర్తకు పార్టీపై సర్వహక్కులు ఉండేలా పార్టీ నియమావళిలోనూ సవరణలు చేశారు. ఆ సమావేశం జరిగిన వెంటనే పార్టీ సంస్థాగత ఎన్నికలపై ప్రకటనలు జారీ అయ్యాయి. అన్ని పదవుల కంటే ముందుగా సమన్వయకర్త, ఉప సమన్వయకర్త పదవులకు ఈనెల 7వ తేదీన ఎన్నికలు జరుగు తాయని ప్రకటించడం, ఆ తర్వాత ఎడప్పాడి, పన్నీర్‌సెల్వం నామినేషన్లు వేయడం చకచకా జరిగి పోయాయి.

Updated Date - 2021-12-07T14:14:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising