ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో ఆఫ్రికన్ సింహాలు, మంచు చిరుతలు సహా 8 పెద్ద పులులకు Coronavirus

ABN, First Publish Date - 2021-11-13T13:01:05+05:30

అమెరికాలో ఆఫ్రికన్ సింహాలు, మంచు చిరుతలు సహా 8 పెద్దపులులకు కొవిడ్-19 పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్ :అమెరికాలో ఆఫ్రికన్ సింహాలు, మంచు చిరుతలు సహా 8 పెద్దపులులకు కొవిడ్-19 పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది. యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఒక పెంపుడు కుక్కకు కరోనా సోకిన కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్‌లోని జంతుప్రదర్శనశాలలో ఎనిమిది పెద్ద పులులు కరోనావైరస్ బారిన పడ్డాయి.సెయింట్ లూయిస్ జూలోని రెండు ఆఫ్రికన్ సింహాలు, రెండు మంచు చిరుతలు, ఒక అముర్ పులి, ఒక ప్యూమా, రెండు జాగ్వర్లకు కరోనా సోకిందని అమెరికన్ జంతుప్రదర్శనశాల అధికారులు చెప్పారు. ఈ వన్యప్రాణులకు తేలికపాటి కరోనా లక్షణాలున్నాయని, వీటికి దగ్గుతోపాటు నాసికల నుంచి ద్రవాలు స్రవిస్తున్నాయని వెటర్నరీ వైద్యులు చెప్పారు. 


సెయింట్ లూయిస్ జూలోని ఇతర 12,000 జంతువులకు కరోనా సోకలేదని  తేలింది. పెద్ద పులులకు కరోనా సంక్రమణ మూలాన్ని సిబ్బంది గుర్తించలేదు. జూపార్కులోని జంతువులకు కరోనా సోకకుండా నెలరోజుల నుంచి కొవిడ్ టీకాలు వేస్తున్నామని జూ అధికారులు చెప్పారు. సెప్టెంబరు నెలలో స్మిత్సోనియన్ నేషనల్ జూపార్కులో ఆరు పెద్దపులులు కరోనావైరస్ బారిన పడ్డాయి.జంతువుల నుంచి మనుషులకు కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం తక్కువగా ఉందని వైద్యనిపుణులు చెబుతున్నారు.


Updated Date - 2021-11-13T13:01:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising