ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనిల్ దేశ్‌ముఖ్ ఆస్తులను సీజ్ చేసిన ఈడీ

ABN, First Publish Date - 2021-07-16T22:53:58+05:30

అవినీతి కేసులో మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్, ఆయన కుటుంబ సభ్యులకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: అవినీతి కేసులో మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ.4.20 కోట్లు విలువచేసే స్థిరాస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారంనాడు జప్తు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈ ఆస్తులను సీజ్ చేసింది. జప్తు చేసిన ఆస్తుల్లో వోర్లిలోని రూ.1.54 కోట్లు విలువచేసే ఒక రెసిడెన్షియల్ ఫ్లాట్, రాయ్‌గఢ్ జిల్లాలోని ఉరన్‌లో 2.68 కోట్ల బుక్ వాల్యూ కలిగిన స్థలాలు ఉన్నట్టు ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది.


రాష్ట్ర హోం మంత్రిగా ఉన్న సమయంలో బార్ ఓనర్ల నుంచి అక్రమంగా రూ.4.70 కోట్ల ముడుపులు తీసుకున్నారన్న అభియోగాలను దేశ్‌ముఖ్ ఎదుర్కొంటున్నారు. ఈ అక్రమ సొమ్మును శ్రీ సాయి శిక్షణ సంస్థ పేరుతో ఉన్న ట్రస్టుకు వచ్చిన నిధులుగా దేశ్‌ముఖ్ కుటుంబ సభ్యులు చూపిస్తున్నట్టు ఈడీ అంటోంది. ఈ కేసులో అనిల్ దేశ్‌ముఖ్ ప్రైవేటు కార్యదర్శి సంజీవ్ పలాండే, ప్రైవేట్ అసిస్టెట్ కుందన్ షిండేలను ఇటీవల ఈడీ అరెస్టు చేసింది. దేశ్‌ముఖ్‌పై ముంబై పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ చేసిన అవినీతి ఆరోపణకు సంబంధించి ఓవైపు సీబీఐ దర్యాప్తు జరుపుతుండగా, మరోవైపు ఆయన ఆర్థిక లావాదేవీలపై ఈడీ దర్యాప్తు సాగిస్తోంది.

Updated Date - 2021-07-16T22:53:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising