ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

model codeని ఉల్లంఘించిన సీఎంకు ఈసీ నోటీసు

ABN, First Publish Date - 2021-10-26T17:43:19+05:30

అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలపై వివరణ కోరుతూ అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మకు ఎన్నికల సంఘం (ఈసీ) తాజాగా నోటీసు జారీ చేసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గౌహతి : అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలపై వివరణ కోరుతూ అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మకు ఎన్నికల సంఘం (ఈసీ) తాజాగా నోటీసు జారీ చేసింది.అసోం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా,అసోం రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత దేబబ్రత సైకియా ఇచ్చిన ఫిర్యాదుల మేర ఈసీ నోటీసు జారీ చేసింది.మంగళవారం సాయంత్రం 5 గంటలలోపు సమాధానం ఇవ్వాలని ఈసీ సీఎం శర్మను ఆదేశించింది.‘‘పేర్కొన్న గడువులోగా ఎలాంటి వివరణను సమర్పించనట్లయితే సీఎంపై చర్యకు తదుపరి నోటీసు లేకుండా కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది.’’ అని ఈసీ పేర్కొంది.


వైద్య కళాశాలలు, రోడ్లు, వంతెనలు, స్టేడియాలు, అభివృద్ధి ప్రాజెక్టులు, స్వయం సహాయక సంఘాలకు నిధులు మంజూరు చేస్తామని భారతీయ జనతా పార్టీ అగ్ర ప్రచారకర్త అయిన సీఎం హిమంత బిస్వా శర్మ ఎన్నికల సభల్లో ప్రకటనలు చేశారని కాంగ్రెస్ నేతలు బోరా, సైకియాలు ఆరోపించారు. ఇలాంటి ప్రకటనల ద్వారా సీఎం హిమంత బిస్వా శర్మ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఎన్నికల కమిషన్ అభిప్రాయ పడిందని ఈసీ కార్యదర్శి ఎన్టీ భూటియా నోటీసు జారీ చేశారు.అక్టోబరు 30న ఉపఎన్నికలు జరగనున్న నియోజకవర్గాల్లోని పలు చోట్ల సభల్లో సీఎం శర్మ చేసిన ప్రసంగాల ఇంగ్లీషు కాపీలను ఈసీ పరిశీలించింది. సీఎం ఇచ్చిన వాగ్దానాలు, ప్రకటనలు చేసినట్లు ధృవీకరించబడిందని ఈసీ నోటీసులో పేర్కొంది.


కొవిడ్ -19 కారణంగా ఇద్దరు శాసనసభ్యులు మరణించారు.ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి అధికార బీజేపీలో చేరారు. దీంతో  తరువాత ఐదు అసెంబ్లీ స్థానాలైన భబానీపూర్, మరియాని, థావ్రా, తముల్‌పూర్, గోసాయిగావ్‌ లలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఎన్నికల తేదీ ప్రకటించిన తర్వాత అధికారంలో ఉన్న పార్టీ ఓటర్లను ప్రభావితం చేసే ప్రాజెక్ట్‌లను ప్రకటించడం లేదా ఆర్థిక గ్రాంట్లు ఇస్తామని ప్రకటించరాదు.


Updated Date - 2021-10-26T17:43:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising