ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pakistan: బలూచిస్తాన్‌లో భారీ భూకంపం...20 మంది మృతి

ABN, First Publish Date - 2021-10-07T12:46:11+05:30

ఇస్లామాబాద్: దక్షిణ పాకిస్థాన్‌లో గురువారం తెల్లవారుజామున జరిగిన భారీ భూకంపం సంభవించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్: దక్షిణ పాకిస్థాన్‌లో గురువారం తెల్లవారుజామున జరిగిన భారీ భూకంపం సంభవించింది. బలూచిస్తాన్ ప్రావిన్షియల్ లో జరిగిన  భూకంపం వల్ల 20 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. తెల్లవారుజామున 3గంటలకు ప్రజలు ఇళ్లలో నిద్రపోతుండగా భూకంపం సంభవించింది. దీంతో పైకప్పులు,గోడలు కూలిపోవడంతో 20 మంది మరణించారని పాక్ అధికారులు చెప్పారు.భూకంపం వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆరోగ్యకార్యకర్తలు టార్చ్ లైట్ల సాయంతో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.7 గా నమోదైందని బలూచిస్తాన్ ప్రావిన్షియల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అధిపతి నసీర్ నాసర్ చెప్పారు.


 మారుమూల పర్వత నగరమైన హర్నాయ్ కేంద్రంగా భూకంపం వచ్చింది. హర్నాయ్ ప్రాంతంలో రోడ్లు, విద్యుత్, మొబైల్ ఫోన్ కవరేజీ లేకపోవడం వల్ల సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోంది. క్షతగాత్రుల్లో చాలామందికి ఎముకలు విరిగిపోయాయని, 40 మందిని చికిత్స కోసం క్వెట్టా ఆసుపత్రికి పంపించామని హరనై ఆసుపత్రి అధికారి జహూర్ తారిన్ చెప్పారు. 


Updated Date - 2021-10-07T12:46:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising