ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉత్తర కాలిఫోర్నియాలో Earthquake...పగిలిన కిటికీల అద్దాలు

ABN, First Publish Date - 2021-12-21T13:41:53+05:30

ఉత్తర కాలిఫోర్నియాలో భూకంపం సంభవించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాలిఫోర్నియా: ఉత్తర కాలిఫోర్నియాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని శాస్త్రవేత్తలు చెప్పారు. భూకంపం వల్ల కిటికీలు పగిలాయి. దుకాణాల్లో పడి పగిలిన సీసాలు, దెబ్బతిన్న భవనం పైకప్పులతో నష్టం వాటిల్లింది.ఉత్తర కాలిఫోర్నియాలోని సముద్ర తీరంలో 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపం తర్వాత పలు భవనాలు అద్దాలు పగిలాయి. తక్కువ జనాభా ఉన్న ప్రాంతం కావడంతో భూకంపం వల్ల తక్కువ నష్టం వాటిల్లింది.సునామీ వచ్చే అవకాశం లేదని నేషనల్ వెదర్ సర్వీస్ తెలిపింది.శాన్ ఫ్రాన్సిస్కోకు వాయువ్యంగా 210 మైళ్ల (337 కిలోమీటర్లు) దూరంలో భూకంపం కేంద్రీకృతమైందని అధికారులు చెప్పారు. 


పెట్రోలియా అనే చిన్న పట్టణంలో 1,000 కంటే తక్కువ మంది ప్రజలు నివసిస్తున్నారు. ఈ భూకంపం అనంతరం ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు.రాళ్లు విరిగిపడిన కారణంగా కొన్ని రోడ్లను మూసివేశారు.ఈ భూకంపం వల్ల ఎలాంటి మరణాలు సంభవించలేదు.ఈ ప్రాంతంలో చివరిసారిగా 1993లో ఇదే విధమైన భూకంపం సంభవించింది, ఒక వ్యక్తి మరణించాడు.సుమారు 20 సెకన్ల పాటు భూమి కంపించిదని పెట్రోలియా జనరల్ స్టోర్ మేనేజర్ జేన్ డెక్స్టర్ చెప్పారు. స్టోర్‌లోని షెల్ఫ్‌ల నుంచి గాజు సీసాలు పడి పగిలిపోయాయని, అయితే ఎవరూ గాయపడలేదని ఆమె చెప్పారు.రాబోయే కొద్ది రోజుల్లో ఉత్తర కాలిఫోర్నియా కోస్తాలో పెద్ద భూకంపాలు సంభవించే అవకాశముందని డైరెక్టర్ మార్క్ గిలార్డుచి హెచ్చరించారు.


Updated Date - 2021-12-21T13:41:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising