ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Amazon కాపీ కొడుతోందా?

ABN, First Publish Date - 2021-10-14T20:28:38+05:30

అమెజాన్ ఇండియా విభాగం తన సొంత ఉత్పత్తుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : అమెజాన్ ఇండియా విభాగం తన సొంత ఉత్పత్తుల అమ్మకాల కోసం అడ్డదారులు తొక్కుతున్నట్లు రాయిటర్స్ నివేదిక వెల్లడించింది. థర్డ్ పార్టీ సెల్లర్స్ అమ్మే ఐటమ్‌లను కాపీ చేసేందుకు పద్ధతి ప్రకారం ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపింది. సెర్చ్ రిజల్ట్స్‌ను కూడా మానిప్యులేట్ చేస్తోందని పేర్కొంది. ‘‘ఇండియా ప్రైవేట్ బ్రాండ్స్ ప్రోగ్రామ్’’ శీర్షికతో 2016లో రూపొందించిన డాక్యుమెంట్ ఆధారంగా ఈ వివరాలను తెలిపింది. 


కాపీ చేయడానికి రిఫరెన్స్ బ్రాండ్లను గుర్తించడం కోసం సేల్స్, కస్టమర్ రివ్యూ డేటాను తాము ఏ విధంగా సమీక్షిస్తామో భారత దేశంలోని అమెజాన్‌కు చెందిన ప్రైవేట్ లేబుల్ టీమ్ వెల్లడించినట్లు ఈ డాక్యుమెంట్ తెలిపిందని రాయిటర్స్ నివేదిక పేర్కొంది. ఉదాహరణకు, తన ప్రైవేట్ లేబుల్ క్లోతింగ్ బ్రాండ్స్‌లో ఒకటి తయారు చేసిన చొక్కాలు కస్టమర్ల నుంచి తిరిగి వస్తుండటాన్ని అమెజాన్ ఇండియా విభాగం ఉద్యోగులు గుర్తించారు. కస్టమర్లు తిప్పి పంపడానికి కారణం ఆ చొక్కాల సైజుకు సంబంధించిన సమస్యలని గుర్తించారు. బాగా అమ్ముడుపోతున్న బ్రాండ్‌ను గుర్తించి, దానికి తగినట్లుగా తమ బ్రాండ్ కొలతలను మార్చి, అమ్మకాలు జరిపినట్లు ఈ నివేదిక పేర్కొంది. 


సెర్చ్ రిజల్ట్స్‌లో అమెజాన్ ప్రైవేట్ లేబుల్ ప్రొడక్ట్స్ అధికంగా వచ్చే విధంగా కూడా అమెజాన్ ఇండియా టీమ్ పని చేసిందని రాయిటర్స్ నివేదిక పేర్కొంది. ‘‘సెర్చ్ సీడింగ్’’, ‘‘స్పార్క్‌ల్స్’’ అనే టెక్నిక్స్ ఉపయోగించి సెర్చ్ రిజల్ట్స్‌ను ప్రభావితం చేసినట్లు తెలిపింది. భారత దేశంలో జరుగుతున్న వ్యాపారం తీరు గురించి హై ర్యాంకింగ్ అమెజాన్ ఎగ్జిక్యూటివ్‌లకు తెలుసునని తెలిపింది. గతంలో ఈ కంపెనీ ఇంటర్నేషనల్ బిజినెస్‌కు నాయకత్వం వహించిన డీగో పియాసెంటిని, ఇంటర్నేషనల్ కన్స్యూమర్ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రసెల్ గ్రండినెట్టి వంటివారికి కూడా ఈ వివరాలు తెలుసునని పేర్కొంది. 


ప్రైవేట్ లేబుల్ ప్రొడక్ట్స్‌ను అభివృద్ధి చేయడంపై గతంలో అమెజాన్ తెలిపిన వివరాలకు, రాయిటర్ నివేదిక వెల్లడించిన అంశాలకు మధ్య పొంతన లేదు. రాయిటర్స్ నివేదికను అమెజాన్ తోసిపుచ్చింది. 


Updated Date - 2021-10-14T20:28:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising