ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రొహింగ్యాలను పద్ధతి లేకుండా పంపించేయొద్దు : సుప్రీంకోర్టు

ABN, First Publish Date - 2021-04-08T21:34:08+05:30

జమ్మూ-కశ్మీరులో నిర్బంధంలో ఉన్న రొహింగ్యాలను నిర్దేశిత ప్రక్రియను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : జమ్మూ-కశ్మీరులో నిర్బంధంలో ఉన్న రొహింగ్యాలను నిర్దేశిత ప్రక్రియను పాటించకుండా మయన్మార్‌కు పంపించవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం గురువారం కేంద్ర ప్రభుత్వానికి ఈ ఆదేశాలు ఇచ్చింది. జమ్మూలో నిర్బంధంలో ఉన్న రొహింగ్యాలను వెంటనే విడుదల చేయాలని, వారిని మయన్మార్‌కు పంపించకుండా కేంద్ర ప్రభుత్వాన్ని నిరోధించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఈ ఆదేశాలు ఇచ్చింది. 


ఈ పిల్‌పై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ, మన దేశం చట్టవిరుద్ధ వలసదారులకు రాజధానిగా ఉండటం సాధ్యం కాదని తెలిపింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ, రొహింగ్యా బాలలను మయన్మార్ సైన్యం చంపుతోందని చెప్పారు. రొహింగ్యాలను లైంగికంగా వేధిస్తోందన్నారు. అంతర్జాతీయ మానవతావాద చట్టాలను మయన్మార్ సైన్యం గుర్తించడం లేదన్నారు. 


Updated Date - 2021-04-08T21:34:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising