ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tamilnadu: అమ్మా క్యాంటీన్లపై డీఎంకే కార్యకర్తల దాడి

ABN, First Publish Date - 2021-05-05T02:35:15+05:30

జయలలితను తమిళనాడులో ‘అమ్మ’ అని పిలుస్తుంటారు. కాగా, తమిళనాడులోని పేదవారికి తక్కువ ధరలో మంచి ఆహారం అందించే లక్ష్యంలో ‘అమ్మ క్యాంటీన్’ పేరుతో భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇది బాగా ఆదరణ పొందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకున్న ఘటనలు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి. బెంగాల్‌తో పాటు మరో మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పటికీ అక్కడ పరిస్థితులు బాగానే ఉన్నాయి అనుకునేలోపు తమిళనాడులో చోటు చేసుకున్న ఘటన కొన్ని అనుమానాలను లేవనెత్తుతోంది. చెన్నై నగరంలోని సైదాపేట్ ప్రాంతంలో అమ్మా క్యాంటీన్లపై మంగళవారం డీఎంకే పార్టీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఫొటోలతో ఉన్న బ్యానెర్లను చింపేసి నానా హడావుడి చేశారు. అయితే వీరిపై డీఎంకే కఠిన చర్యలు తీసుకుంది. ఇద్దరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు ఇచ్చి అరెస్ట్ చేయించారు.


జయలలితను తమిళనాడులో ‘అమ్మ’ అని పిలుస్తుంటారు. కాగా, తమిళనాడులోని పేదవారికి తక్కువ ధరలో మంచి ఆహారం అందించే లక్ష్యంలో ‘అమ్మ క్యాంటీన్’ పేరుతో భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇది బాగా ఆదరణ పొందింది. లాక్‌డౌన్ సమయంలో కూడా అనేక మందికి ఈ అమ్మ క్యాంటీన్ ఉపయోగపడింది. అలాంటి క్యాంటీన్‌పై దాడి చేయడం, పైగా ఎన్నికల ఫలితాలు వచ్చిన అనంతరం ఈ ఘటన జరగడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది.

Updated Date - 2021-05-05T02:35:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising