ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమీషన్‌, కలెక్షన్‌, కరప్షన్‌..!

ABN, First Publish Date - 2021-01-25T12:25:54+05:30

అన్నాడీఎంకే ప్రభుత్వ తీరు కమీషన్‌.. కలెక్షన్‌.. కరప్షన్‌.. అన్న చందంగా వుందని, అయితే ఇందుకు భిన్నంగా ముఖ్యమంత్రి డాంబికాలు చెప్పుకుంటూ ఓట్ల కోసం ....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అన్నాడీఎంకే సర్కారు పాలనపై స్టాలిన్‌ ధ్వజం

చెన్నై/ప్యారీస్‌ (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకే ప్రభుత్వ తీరు కమీషన్‌.. కలెక్షన్‌.. కరప్షన్‌.. అన్న చందంగా వుందని, అయితే ఇందుకు భిన్నంగా ముఖ్యమంత్రి డాంబికాలు చెప్పుకుంటూ ఓట్ల కోసం పాకులాడుతున్నారని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ మండిపడ్డారు. స్థానిక మధురవాయల్‌ నియోజకవర్గం అడయాళంపట్టులో డీఎంకే ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా గ్రామసభలో స్టాలిన్‌ పాల్గొని ప్రసంగించారు. పార్టీ తరఫున ఇప్పటివరకు 2 వేల గ్రామసభలు నిర్వహించామని, వీటిలో 1 కోటి 25 లక్షల మందికిపైగా పాల్గొన్నారని తెలిపారు. అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు ఈ సభలలో పాల్గొన్న ప్రజలు ప్రకటించారని, ఈ సభలు తనకు సంతృప్తినిచ్చాయన్నారు. అన్నివర్గాల ప్రజలు ఈ పదేళ్ల అన్నాడీఎంకే పాలనలో నష్టపోయారని, ముఖ్యంగా అన్నదాతలకు తీవ్ర అన్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు. జయలలిత ముఖ్యమత్రిగా రావాలన్న ఉద్దేశంతో ప్రజలు ఆమెను 2016 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గెలిపించారని, అదే ఏడాది అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మరణించారని, ఈ మరణం ఎలా సంభవించిందో ఇప్పటికీ అనుమానంగానే ఉందన్నారు. ఈ నెల 27వ తేదీన జయలలిత స్మారక మందిరాన్ని ప్రారంభించనున్న సీఎం ఎడప్పాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం ఒ.పన్నీర్‌సెల్వంలు అంతకు ముందే జయ మరణంలో దాగివున్న అనుమానాలను నివృత్తి చేసేలా ప్రకటన విడుదల చేయాలని స్టాలిన్‌ డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-01-25T12:25:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising