ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Dmdk కార్యాచరణ అధ్యక్షురాలిగా ప్రేమలత?

ABN, First Publish Date - 2021-12-09T14:19:28+05:30

దేశీయ ముర్పోక్కు ద్రావిడ కళగం (డీఎండీకే) కార్యాచరణ అధ్యక్షురాలిగా ప్రేమలతా విజయకాంత్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ప్రముఖ సినీనటుడు విజయకాంత్‌ గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: దేశీయ ముర్పోక్కు ద్రావిడ కళగం (డీఎండీకే) కార్యాచరణ అధ్యక్షురాలిగా ప్రేమలతా విజయకాంత్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ప్రముఖ సినీనటుడు విజయకాంత్‌ గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ.. క్రియాశీలక కార్యకలాపాలకు దూరంగా వుంటున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో విజయకాంత్‌ ప్రచారం చేయలేకపోయారు. ఈ పరిస్థితుల్లో పార్టీ కోశాధికారిగా ఉన్న విజయకాంత్‌ సతీమణి ప్రేమలత, ఆయన బావమరిది ఎల్కే సుదీష్‌, కుమారుడు విజయ్‌ ప్రభాకర్‌ పార్టీ వ్యవహారాలను సమష్టిగా నిర్వహిస్తున్నారు. విజయకాంత్‌ సొంత పార్టీని ప్రారంభించి అంచెలంచెలుగా ఓటు బ్యాంకును పెంచుకుంటూ అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకుని ప్రధాన ప్రతిపక్ష స్థాయికి తీసుకెళ్ళారు. అయితే 2011లో  విజయకాంత్‌కు నాటి ముఖ్యమంత్రి జయలలితతో రేగిన వివాదం ఫలితంగా డీఎండీకే ఎమ్మెల్యేలు పలువురు అన్నాడీఎంకేలో చేరిపోయారు. ఇక అప్పటి నుంచి డీఎండీకే కీర్తి ప్రతిష్టలు తగ్గుతూ వచ్చాయి. గత పదేళ్లుగా పార్టీ వరుస ఓటములతో దిగజారిపోయింది. దీనికి తోడు విజయకాంత్‌ అనారోగ్యంతో మాట్లాడలేని స్థితిలో ఇంటివద్దే విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో ప్రేమలత అన్నీ తానై నిర్ణయాలు తీసుకుంటున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన ఆ పార్టీ జిల్లా కార్యదర్శుల సమావేశంలో పార్టీ భవిష్యత్తుపై కూలంకషంగా చర్చించారు. పార్టీ కోశాధికారి కెప్టెన్‌ సతీమణి ప్రేమలతను పార్టీ కార్యాచరణ అధ్యక్షురాలిగా నియమిస్తే పార్టీ అన్నిచోట్లా అభివృద్ధి చెందగలదని జిల్లా నేతలు పేర్కొన్నారు. ఒక వేళ కార్యాచరణ అధ్యక్షురాలి గా నియమించకపోతే, పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవిని ఏర్పాటు చేసి,  ప్రేమలతను నియమించాలని కోరారు. వచ్చే యేడాది ఫిబ్రవరిలోగా కార్పొరేషన్‌, మున్సిపాలిటీ ఎన్నికలు జరుగనుండడంతో ఆ లోగా పార్టీకి నూతన జవసత్వాలు కల్పించే దిశగా ప్రేమలతకు పార్టీ పగ్గాలను అప్ప గించాలని నేతలంతా గట్టిగా అభిప్రాయపడ్డారు. దీంతో విజయకాంత్‌కూడా తన సతీమణిని కార్యాచరణ అధ్యక్షురాలిగా నియమించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు ్టతెలుస్తోంది. ఆ మేరకు త్వరలోనే నిర్ణయం వెలువడనున్నట్టు సమాచారం. 

Updated Date - 2021-12-09T14:19:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising