ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శశికళ రాజకీయాల్లోకి రావాలి

ABN, First Publish Date - 2021-01-25T11:44:01+05:30

సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని శశికళ రాజకీయాల్లోకి రావాలనేది ఒక మహిళగా తన ఆశ అని డీఎండీకే కోశాధి కారి ప్రేమలత తెలిపారు. చెంగల్పట్టు జిల్లా సిక్కరాపురంలోని ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 డీఎండీకే కోశాధికారి ప్రేమలత

చెన్నై/ పెరంబూర్‌ (ఆంధ్రజ్యోతి): సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని శశికళ రాజకీయాల్లోకి రావాలనేది ఒక మహిళగా తన ఆశ అని డీఎండీకే కోశాధి కారి ప్రేమలత తెలిపారు. చెంగల్పట్టు జిల్లా సిక్కరాపురంలోని కల్యాణ మండపంలో జిల్లా నిర్వాహకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ, దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు అండగా, ఎలాంటివి ఆశించకుండా ఉన్న వ్యక్తి శశికళ అని అన్నారు. ఆమె ద్వారా లబ్ధి పొందిన వారు ప్రస్తుతం ఆమె వద్దు అనడం ఆవేదన కలిగిస్తుందన్నారు. విజయకాంత్‌ అనుమతిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. అయితే అన్నీ ఆలోచించి తగిన నిర్ణయం తీసుకుంటారన్నారు. 

‘ముందుచూపు’తోనే.. 

గతంలో శశికళపై విమర్శలు గుప్పించిన డీఎండీకే పార్టీ నాయకురాలు ప్రేమలత.. హఠాత్తుగా ఆమెను పొగడడం చర్చనీయాంశమైంది. అన్నాడీ ఎంకే నేతలంతా శశికళపై విమర్శలు గుప్పిస్తుంటే ఆ కూటమిలో వున్న డీఎండీకే నాయకురాలు ఈ వ్యాఖ్యలు చేయడంతో ఆసక్తి నెలకొంది. అన్నాడీఎంకే నుంచి మరిన్ని సీట్లు పొందడం లేదా అమ్మామక్కల్‌ మున్నేట్ర కళగాన్ని మంచి చేసుకోవడం లక్ష్యంగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. ఒకవేళ అన్నాడీఎంకే నుంచి తగినన్ని సీట్లు రానిపక్షంలో అమ్మా మక్కల్‌ మున్నేట్రకళగంతో చేతులు కలిపేందుకే ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. 


Updated Date - 2021-01-25T11:44:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising