ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రధానితో భేటీ.. నిరాశ చెందామన్న గుప్కార్ కూటమి!

ABN, First Publish Date - 2021-07-05T20:16:37+05:30

ప్రధాని మోదీతో జమ్మూకశ్మీర్ అఖిల పక్ష నేతల భేటీ ఆశించిన ఫలితం ఇవ్వలేదంటూ గుప్కార్ కూటమి సోమవారం నాడు ఓ ప్రకటన విడుదల చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రధాని మోదీతో జమ్మూకశ్మీర్ అఖిల పక్ష నేతల భేటీ ఆశించిన ఫలితం ఇవ్వలేదంటూ గుప్కార్ కూటమి సోమవారం నాడు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సమావేశంపై నిరాశ చెందినట్టు కూటమి నేతలు పేర్కొన్నారు. రాజకీయ ఖైదీల విడుదల వంటి విశ్వాసం పెంచే చర్యలేవీ తీసుకోలేదని వారు తెలిపారు. గుప్కార్ కూటమి నేతలు ఆదివారం నాడు నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా సారథ్యంలో సమావేశం అయినట్టు కూటమి ప్రతినిధి సీపీఐ(ఎమ్) నేత ఎమ్‌వై తారిగమ్ తెలిపారు. 


ఈ సమావేశానికి గుప్కార్ ఉపాధ్యక్షురాలు పీడీపీ ప్రెసిడెంట్ మెహబూబా ముఫ్తీ, ఎన్‌సీ నేత హస్నైన్ మసూదీ, పీపుల్స్ మూవ్‌మెంట్ అధినేత ముస్తాఫా మిర్, అవామీ నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నేత ముజఫ్పర్ అహ్మద్ షా హాజరయ్యారు. జూన్ 24న ప్రధానితో జరిగిన భేటీపై ఈ సమావేశంలో నేతలు చర్చించారు. 2019 నుంచీ జమ్మూకశ్మీర్‌కు ఊపిరాడకుండా చేస్తున్న అణచివేత వాతావరణానికి ముగింపు పలికే పటిష్ట చర్యల ప్రస్తావన లేకపోవడం పట్ల నేతలు ఈ సమావేశంలో నిరాశ వ్యక్తం చేసినట్టు గుప్కార్ కూటమి ప్రతినిధి పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌ సమస్యకు సంబంధించినంత వరకూ అక్కడి ప్రజలే భాగస్వాములు, బాధితులు కూడా.. అని ఆయన వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-07-05T20:16:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising