ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రిడేటెడ్‌ జర్నలిస్టుల్లో అసాంఘిక శక్తులు: దేవిరెడ్డి

ABN, First Publish Date - 2021-04-09T07:34:25+05:30

‘‘ఆంధ్రప్రదేశ్‌లోని అక్రిడేటెడ్‌ జర్నలిస్టుల్లో అసాంఘిక శక్తులు, బోగస్‌ పాత్రికేయులు ఉన్నారు. వారిని ఏరివేసే ప్రక్రియ చేపట్టినందువల్లే అక్రిడేషన్ల పంపిణీలో జాప్యం జరుగుతోంది. నికార్సయిన పాత్రికేయులకు మాత్రమే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): ‘‘ఆంధ్రప్రదేశ్‌లోని అక్రిడేటెడ్‌ జర్నలిస్టుల్లో అసాంఘిక శక్తులు, బోగస్‌ పాత్రికేయులు ఉన్నారు. వారిని ఏరివేసే ప్రక్రియ చేపట్టినందువల్లే అక్రిడేషన్ల పంపిణీలో జాప్యం జరుగుతోంది. నికార్సయిన పాత్రికేయులకు మాత్రమే అక్రిడేషన్లు అందాలని సీఎం సూచించారు. ప్రభుత్వ గుర్తింపును అడ్డం పెట్టుకొని అనర్హులు అనేక ప్రయోజనాలను పొందడాన్ని అడ్డుకోవాలని సీఎం స్పష్టం చేశారు’’ అని ఏపీ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ దేవిరెడ్డి శ్రీనాథ్‌ అన్నా రు. ఆయన గురువారం ఏపీ భవన్‌లో అకాడమీ కార్యదర్శి బాల గంగాధర్‌ తిలక్‌తో కలిసి విలేకర్లతో మాట్లాడారు. ఒకటి రెండు జర్నలిస్టు యూనియన్లు  కోర్టుకు వెళ్లడం జాప్యానికి మరో కారణమని వివరించారు. ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మాస్‌ కమ్యునికేషన్‌ (ఐఐఎంసీ) ప్రాంతీయ కేంద్రాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావదేకర్‌ను కలిసి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. 

Updated Date - 2021-04-09T07:34:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising