ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శరీర వాసనతో కరోనాను పసిగట్టే పరికరం

ABN, First Publish Date - 2021-06-14T07:05:50+05:30

శరీర వాసన ఆధారంగా కరోనా రోగులను గుర్తించే సరికొత్త పరికరాన్ని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్‌ అండ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌, డర్హం వర్సిటీలకు చెందిన పరిశోధకులు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • అభివృద్ధిచేసిన బ్రిటన్‌ శాస్త్రవేత్తలు

లండన్‌, జూన్‌ 13 : శరీర వాసన ఆధారంగా కరోనా రోగులను గుర్తించే సరికొత్త పరికరాన్ని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్‌ అండ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌, డర్హం వర్సిటీలకు చెందిన పరిశోధకులు రోబో సైంటిఫిక్‌ అనే బయోటెక్‌ కంపెనీ భాగస్వామ్యంతో దీన్ని తయారు చేశారు. కోళ్లఫామ్‌లలోని కోళ్ల మందలో ఇన్ఫెక్షన్లను గుర్తించేందుకు ప్రస్తుతం వాడుకలో ఉన్న శాంప్లింగ్‌ పద్ధతి ప్రాతిపదికగా ఈ పరికరానికి రూపమిచ్చారు. ఆర్గానిక్‌ సెమీ కండక్టింగ్‌ సెన్సర్లతో కూడిన ఈ పరికరాన్ని రెండు వేర్వేరు మోడళ్లలో ఉత్పత్తి చేయాలని యోచిస్తున్నారు. మొదటి మోడల్‌.. చేతిలో ఇమిడిపోయే ఫోన్‌లా, రెండో మోడల్‌.. మొత్తం గది/ప్రాంగణాన్ని స్ర్కీనింగ్‌ చేసే సీసీ కెమెరా తరహాలో ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. మోడల్‌ ఏదైనా సరే.. ఈ పరికరం ఒక నిర్దేశిత ప్రాంతాన్ని స్ర్కీన్‌ చేసి, శరీర వాసన ఆధారంగా ఆ ప్రాంతంలో కరోనా రోగులు ఎవరైనా ఉన్నారా ? లేదా? అనేది గుర్తిస్తుంది. అయితే ఆ రోగులు ఎవరు అనేది మాత్రం గుర్తించలేదు. ఇన్ఫెక్షన్‌ ఎవరికి ఉంది అనేది నిర్ధారించుకునేందుకు ఆ ప్రాంతంలో ఉన్న వారందరికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ పరికరంతో నిర్వహించిన ప్రయోగ పరీక్షల్లో అత్యంత కచ్చితత్వంతో కూడిన ఫలితాలు వచ్చాయని శాస్త్రవేత్తలు తెలిపారు. 

Updated Date - 2021-06-14T07:05:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising