ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి హెచ్చరికతో మంగళసూత్ర వాణిజ్య ప్రకటన withdraw

ABN, First Publish Date - 2021-11-01T13:56:37+05:30

ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ చేసిన మంగళసూత్ర వాణిజ్య ప్రచార చిత్రాన్ని ఆదివారం ఉపసంహరించుకుంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్ :ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ  చేసిన మంగళసూత్ర వాణిజ్య ప్రచార చిత్రాన్నిఉపసంహరించుకుంది. మంగళసూత్ర వాణిజ్య ప్రకటనను 24 గంటల్లోగా ఉపసంహరించుకోవాలని మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా అల్టిమేటం జారీ చేశారు.  వాణిజ్య ప్రకటనను ఉపసంహరించుకోకుంటే పోలీసు బలగాలను పంపిస్తానని సాక్షాత్తూ హోంశాఖ మంత్రి బెదిరించడంతో ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ దిగివచ్చారు. ‘‘వారసత్వం, సంస్కృతిని డైనమిక్ సంభాషణగా మార్చే సందర్భంలో, మంగళసూత్ర ప్రచారం చేశాం. కాని ఈ ప్రచారం సమాజంలోని ఒక వర్గాన్ని కించపరిచేలా ఉందని మేం చాలా బాధపడ్డాం. సబ్యసాచి ప్రచార ప్రకటనను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు’’ అని డిజైనర్ సంస్థ ఇన్‌స్టాగ్రామ్ కథనంలో రాసింది.



ఈ ప్రమోషనల్ ఫొటో‌షూట్‌లో మోడల్స్ మంగళ సూత్రం ధరించి కనిపించారు. కొంత మంది ఒంటరిగా మంగళ సూత్రం ధరించగా, మరికొంత మంది అసభ్యకర రీతుల్లో మంగళ సూత్రం ధరించారు. ఫలితంగా నెటిజన్లు సబ్యసాచిని  ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.దీంతో సబ్యసాచి తన వాణిజ్య ప్రకటనను ఉపసంహరించుకున్నారు.

Updated Date - 2021-11-01T13:56:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising