ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డేరా బాబాకు జీవిత ఖైదు

ABN, First Publish Date - 2021-10-19T07:15:01+05:30

డేరా సచ్చా సౌదా చీఫ్‌, వివాదాస్పద మత గురువు గుర్మీత్‌ రాం రహీం సింగ్‌ (డేరా బాబా)కు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్‌, అక్టోబరు 18: డేరా సచ్చా సౌదా చీఫ్‌, వివాదాస్పద మత గురువు గుర్మీత్‌ రాం రహీం సింగ్‌ (డేరా బాబా)కు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం జీవిత కారాగార శిక్ష విధించింది. అతనితో పాటు మరో నలుగురికి కూడా ఇదే శిక్ష ఖరారు చేసింది. 19 ఏళ్ల క్రితం జరిగిన డేరా సచ్చా సౌదా మేనేజర్‌ రంజిత్‌ సింగ్‌ హత్య కేసులో విచారణ అనంతరం కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. ఈ కేసులో పంచకులలోని సీబీఐ ప్రత్యేక కోర్టు రాం రహీం సింగ్‌తో పాటు కృష్ణణ్‌ లాల్‌, జస్బీర్‌ సింగ్‌, అవతార్‌ సింగ్‌, సబ్దిల్‌లను కూడా దోషులుగా నిర్ధారించింది. డేరా సచ్చా సౌదా మేనేజర్‌ రంజిత్‌ సింగ్‌  ఖాన్పూర్‌ కోలియన్‌ గ్రామంలో 2002 జూలై 10న హత్యకు గురయ్యాడు. డేరా ఆశ్రమంలో మహిళలపై జరిగే లైంగిక వేధింపులను పేర్కొంటూ అప్పట్లో విడుదలైన ఓ లేఖ సంచలనం సృష్టించింది. ఈ లేఖను రంజిత్‌ సింగ్‌ రాసినట్లు డేరా బాబా అనుమానించారు. ఈ తరుణంలో డేరా బాబానే ఈ హత్యకు కుట్ర పన్నినట్లు సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. 

Updated Date - 2021-10-19T07:15:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising