ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు టీకాలు వేసుకున్నా కూడా ‘డెల్టా’ ప్రమాదం!

ABN, First Publish Date - 2021-11-25T02:14:35+05:30

కొవిడ్-19 మహమ్మారిని నివారించేందుకు దేశంలో ముమ్మరంగా టీకా కార్యక్రమం కొనసాగుతోంది. కొవిడ్ పాజిటివ్ కేసులు కూడా అత్యల్ప స్థాయికి పడిపోయాయి. టీకా దొరికింది, కేసులు తగ్గాయని సంబరపడేలోపే మరో వార్త ఆందోళనను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కొవిడ్-19 మహమ్మారిని నివారించేందుకు దేశంలో ముమ్మరంగా టీకా కార్యక్రమం కొనసాగుతోంది. కొవిడ్ పాజిటివ్ కేసులు కూడా అత్యల్ప స్థాయికి పడిపోయాయి. టీకా దొరికింది, కేసులు తగ్గాయని సంబరపడేలోపే మరో వార్త ఆందోళనను రేకెత్తిస్తోంది. తాజాగా చేసిన ఓ అధ్యయనం ప్రకారం.. కొవిడ్ రెండు టీకాలు వేసుకున్నప్పటికీ కొత్తగా వస్తోన్న డెల్టా వేరియంట్ ‘సార్స్-కొవ్-2’ ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు. ఐఎన్ఎస్ఏసీఓజీ కన్సార్షియం, సీఐఎస్ఆర్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ పరిశోధకులు సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో డెల్టా వేరియంట్‌పై పోరాడడానికి ప్రత్యేక వ్యాక్సీన్ అవసరమని పేర్కొన్నారు. దానితో పాటు అధిక జనాభా ఉన్న మన దేశంలో వ్యాక్సీన్ల కంటే కూడా నివారణ, నియంత్రణ చేపట్టాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. ఈ అధ్యయనంలో ఒక చిన్న ఉపశమనం లాంటి వార్త చెప్పారు. డెల్టా వేరియంట్‌ను ప్రస్తుత టీకాలు అడ్డుకోలేకపోయినప్పటికీ దాని నుంచి కొంత ఉపశమనాన్ని మాత్రం ఇవ్వగలవని తెలిపారు. ఢిల్లీలోని రెండు ఆసుపత్రుల్లో ఈ అధ్యయనం నిర్వహించిన అనంతరం ఈ విషయాన్ని నిర్ధారించినట్లు వారు పేర్కొన్నారు.

Updated Date - 2021-11-25T02:14:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising