ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi zoo: పార్కు రేపటినుంచి పునర్ ప్రారంభం

ABN, First Publish Date - 2021-07-31T13:47:50+05:30

జంతుప్రేమికులకు శుభవార్త. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని జంతుప్రదర్శనశాలను రేపటినుంచి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేటి నుంచి ఆన్ లైన్లో టికెట్లు

న్యూఢిల్లీ : జంతుప్రేమికులకు శుభవార్త. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని జంతుప్రదర్శనశాలను రేపటినుంచి పునర్ ప్రారంభించనున్నారు. కరోనా వైరస్ మహమ్మారి వల్ల మూసివేసిన ఢిల్లీ జూపార్కును ఆగస్టు 1వతేదీ నుంచి పునర్ ప్రారంభిస్తామని జూపార్కు అధికారులు చెప్పారు. కొవిడ్-19 భద్రతా నిబంధనలు పాటిస్తూ సందర్శకులకు శనివారం నుంచి ఆన్ లైన్ లో జూపార్కు సందర్శనకు టికెట్లు ఇస్తామని అధికారులు ప్రకటించారు. జూపార్కును రెండు షిప్టుల వారీగా తెరుస్తామని, ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 4 గంటల వరకు తెరుస్తామని ఢిల్లీ జూపార్కు డైరెక్టర్ రమేష్ కుమార్ పాండే చెప్పారు. 


జూ పార్కును శానిటైజ్ చేయించామని, సందర్శకులు జూపార్కు వెబ్ సైట్ నుంచి ఆన్ లైన్ లో టికెట్లు కొని ఎంట్రీగేటు వద్ద క్యూఆర్ కోడ్ సాయంతో ప్రవేశించవచ్చని అధికారులు చెప్పారు. ఒక షిప్టులో 1500మంది సందర్శకులు చొప్పున రోజుకు 3వేల మందిని మాత్రమే జూపార్కు సందర్శనకు అనుమతిస్తామని అధికారులు వివరించారు.జూపార్కు మొత్తాన్ని రోజుకు రెండు సార్లు శానిటైజ్ చేయిస్తామని, పార్కులో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. జూపార్కును గత ఏడాది మార్చి 18వతేదీన కొవిడ్ కారణంగా మూసివేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 1వతేదీన తెరిచినా మళ్లీ సెకండ్ వేవ్ వల్ల ఏప్రిల్ 15 నుంచి మూసివేశారు. 

Updated Date - 2021-07-31T13:47:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising