ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజధానిలో రేపటి నుంచి తెరుచుకోనున్న వారాంతపు మార్కెట్లు!

ABN, First Publish Date - 2021-08-08T11:45:21+05:30

దేశరాజధాని ఢిల్లీలో రేపటి(ఆగస్టు 9) నుంచి వారాంతపు మార్కెట్లు తెరుచుకోనున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో రేపటి(ఆగస్టు 9) నుంచి వారాంతపు మార్కెట్లు తెరుచుకోనున్నాయి. కరోనా వైరస్ సెకెండ్ వేవ్‌లో కేసులు పెరుగుతున్న దృష్ట్యా కరోనా కట్టడి చర్యల్లో భాగంగా వారాంతపు మార్కెట్లను మూసివేశారు. తరువాత అన్ లాక్ ప్రక్రియల్లో భాగంగా వాటిని తిరిగి తెరుస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన ట్విట్టర్ ఖాతాలో... ‘సోమవారం నుంచి వారాంతపు మార్కెట్లు తెరుచుకోనున్నాయి. ఈ మార్కెట్లలో రోజువారీ ఉపాధి పొందేవారి గురించి ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. 


అందరికీ ఆరోగ్యం, సుఖవంతమైన జీవితం అవసరం. ఈ మార్కెట్లను తెరిచిన తరువాత ఇక్కడి వ్యాపారులు. ఇక్కడికి వచ్చే ప్రజలు తప్పనిసరిగా కోవిడ్ ప్రొటోకాల్ పాటించాలి’ అని కోరారు. ఢిల్లీలో సుదీర్ఘకాలం తరువాత వారాంతపు మార్కెట్లు తెరుచుకోనున్నాయి. దీనికి ముందు 50 శాతం వెండర్స్ సామర్థ్యంతో ఒక జోన్‌లో ఒక రోజు మార్కెట్లు తెరిచేందుకు అనుమతినిచ్చారు. అలాగే రెండు వారాల క్రితమే 100 శాతం సామర్థ్యంలో నడిపేందుకు మెట్రోకు అనుమతినిచ్చారు.

Updated Date - 2021-08-08T11:45:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising