ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi: భారీవర్షాలు...ఆరంజ్ అలర్ట్ జారీ

ABN, First Publish Date - 2021-09-01T15:51:26+05:30

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో బుధవారం కురుస్తున్న భారీవర్షాలతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో బుధవారం కురుస్తున్న భారీవర్షాలతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీవర్షాలతో వరదనీరు నిలవడం వల్ల నగరంలో వాహనాల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. ఢిల్లీలో బుధవారం నాడు కూడా భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) వెల్లడించింది. ఢిల్లీలో బుధవారం ఐఎండీ ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది.  ఢిల్లీలోని ఆజాద్ మార్కెట్ సబ్ వే, ప్రతాప్ నగర్ ప్రాంతాల్లో భారీగా వరదనీరు నిలిచింది. వరదనీటి ప్రవాహంతో జఖీరియా అండర్ పాస్ ను మూసివేశారు. 


ఢిల్లీ-ఆగ్రా రైలుమార్గంలో వరదనీటి ప్రవాహంతో కల్వర్టు కొట్టుకుపోయి 20 అడుగుల లోతు గుంత ఏర్పడింది. దీంతో ఢిల్లీ-ఆగ్రా మార్గంలోని 15 రైళ్ల రాకపోకలను రద్దు చేశారు.ఢిల్లీ, ఎన్సీఆర్, గురుగ్రామ్, మానేసర్, ఫరీదాబాద్, బల్లభ్ గడ్, తోషం, భివానీ, జాజ్జార్, నార్నౌల్, మహేంద్రఘడ్, కోసాలి ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ ట్వీట్ చేసింది. ఈ నెల 4వతేదీ వరకు ఢిల్లీలో భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ వివరించింది.


Updated Date - 2021-09-01T15:51:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising