ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

burst firecrackersతో ఢిల్లీని ముంచెత్తిన వాయు కాలుష్యం

ABN, First Publish Date - 2021-11-05T13:22:04+05:30

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో శుక్రవారం వాయు కాలుష్యం ముంచెత్తింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో శుక్రవారం వాయు కాలుష్యం ముంచెత్తింది. రాజధానిలో నిషేధం విధించినా గురువారం రాత్రి ప్రజలు పటాకులు కాల్చడంతో వాయు కాలుష్యం అలముకుంది. ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకరస్థాయికి చేరింది. నోయిడాలో అత్యధికంగా కాలుష్యం కమ్ముకుంది. ఢిల్లీలోని పూసా రోడ్డులోనూ గాలి నాణ్యత క్షీణించింది. ఢిల్లీలో బుధవారం సాయంత్రం 4 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 314 నుంచి 341 వద్ద ఉంది. దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చడంతో నోయిడాలో ఏక్యూఐ526కు పెరిగింది. ఢిల్లీలో పూసారోడ్డు వద్ద 505 కు చేరింది. 


ఏక్యూఐ 500 దాటిందంటే తీవ్రమైన కాలుష్యం ఏర్పడిందని తేలింది. పంజాబ్, హర్యానాలో పొలాల మంటల నుంచి వెలువడిన పొగ దేశ రాజధాని వైపు వచ్చింది.పటాకుల వ్యతిరేక ప్రచారం చేయడంతోపాటు 13,000 కిలోలకు పైగా అక్రమ పటాకులను స్వాధీనం చేసుకొని, 33 మందిని అరెస్టు చేసినట్లు ప్రభుత్వ అధికారులు చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వం బాణాసంచాపై నిషేధం విధించినప్పటికీ, దీపావళి సందర్భంగా చాలా మంది ప్రజలు వీధుల్లో క్రాకర్లు కాల్చడం కనిపించింది. 


దీంతోపాటు వ్యవసాయ పొలాల్లో మంటల నుంచి వెలువడిన పొగ వల్ల ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణించింది.ఢిల్లీ ఆకాశాన్ని పొగమంచు దట్టమైన దుప్పటి కప్పివేసింది. ఢిల్లీలో వాయు కాలుష్యం వల్ల చాలా మంది ప్రజలు గొంతు, దురద,కళ్ల నుంచి నీరు కారుతున్నట్లు ఫిర్యాదులు చేశారు.


Updated Date - 2021-11-05T13:22:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising